Inter Colleges: ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపు సందేహమే..
- తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీల అనుబంధ గుర్తింపులో తప్పని ఇబ్బందులు
- కాలేజీలు ప్రారంభం అయినా పూర్తి కానీ గుర్తింపు ప్రక్రియ
- ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపు సందేహమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter Colleges: తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీల అనుబంధ గుర్తింపులో ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. చాలా జూనియర్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 1471 ప్రైవేటీ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు 958 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు మాత్రమే అనుబంధ గుర్తింపు లభించింది. 5 వందలకు పైగా కాలేజీల గుర్తింపు ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. కాలేజీలు ప్రారంభం అయినా గుర్తింపు ప్రక్రియను ఇంటర్ బోర్డు పూర్తి చేయకపోవడం గమనార్హం. కాలేజీల ప్రారంభంకుముందే పూర్తి చేస్తామని గతంలో బోర్డు ప్రకటించింది. ఇప్పుడు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే జాయిన్ కావాలని… వెబ్ సైట్‌లో అనుమతి ఉన్న కాలేజీల జాబితా ఉందని ఇంటర్ బోర్డు చెబుతోంది.
Read Also: Tamil Nadu: నీట్‌ను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం..
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
అనుబంధ గుర్తింపు లేని కాలేజీల్లో చేరితే పరీక్షలకు అనుమతి ఉండదని ఇంటర్‌బోర్డు అంటోంది. మిక్స్డ్ అక్యూపెన్సీ బిల్డింగ్‌లో నడుస్తున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వని బోర్డు… ప్రభుత్వ చొరవతో రెండేళ్లు కాలేజీలు అనుమతి పొందాయి. ఈ క్రమంలోనే ఆ గడువు ముగిసింది. ఆ కాలేజీలకు అగ్నిమాపక శాఖ ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తేనే వాటికి గుర్తింపు లభించనుంది. అనుబంధ గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని బోర్డు ప్రకటన విడుదల చేసింది.ఇప్పటికే చాలా కాలేజీల్లో విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు పట్టించుకోలేదు. మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్‌లో నడుస్తున్న 360కి పైగా జూనియర్ కాలేజీల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారింది.
దశాబ్దాలుగా ఈ బిల్డింగ్‌లోనే కాలేజీలు నడుస్తున్నాయని ప్రైవేట్ జూనియర్ కాలేజి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ కాలేజీలకు మినహాయింపు ఇవ్వాలని, వేలాది సిబ్బంది పని చేస్తున్నారని యాజమాన్యాలు తెలిపాయి. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తేవడమో, కాలేజీని షిఫ్ట్ చేయడమో అయ్యే పని కాదని.. ప్రభుత్వం ఆలోచించాలి , మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!