తెలంగాణలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దీక్షకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోడ్డుపై జగ్గారెడ్డి దీక్ష చేపట్టారు. రెండేళ్లుగా ఇంటర్ బోర్డు తీరు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తక్షణమే ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులను కలిపే పద్ధతిని అనుసరించాలని ఆయన ప్రభుత్వాన్ని…
తెలంగాణలో ఇంటర్ ఫలితాలతో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 49 శాతం పాస్ కావడంతో విద్యార్థులు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే విద్యార్థి సంఘాలు జూనియర్ కాలేజీల బంద్‌ను సైతం నిర్వహించాయి. దీంతో ప్రతిరోజు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలకు దిగుతున్నారు. అటు జిల్లాల్లో సైతం ఇదేపరిస్థితి నెలకొంది. తరగతులు నిర్వహించకుండా పరీక్షలు పెట్టి తమను ఫెయిల్ చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ఇంటర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇంటర్ బోర్డు…
తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ షాకిచ్చింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు… నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయన్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.…
తెలంగాణలో గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చదువు చెప్పకుండా విద్యార్థులను ప్రభుత్వం ఫెయిల్ చేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలామంది పేద విద్యార్థులు తరగతులకు హాజరు కాలేకపోయారని, ఫెయిలైన వారందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Read Also:…
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను బుధవారం ప్రకటించాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఫలితాలను రేపు విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. థియరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయినప్పటికీ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3…
కరోన కేసులు పెరుగుతుండడం తో 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం జూన్ ,జులై లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహణ సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలు ఎంటనే దాని పై దృష్టి పెట్టింది ఇంటర్ బోర్డ్. ప్రస్తుతం సెకండ్ ఇయర్ లో ఉన్న వారు మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు.. ఆ మార్క్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రాతిపదికన తీసుకొని విద్యార్థుల పలితాలు ప్రకటించే ఆప్షన్ ని…