Inter Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది… ఈ విద్యా సంవత్సరం అనుబంధ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ ఓ నిర్ణయానికి వచ్చింది.. ఆ కాలేజీలో చదువుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షల ఫీజుని ఆ కాలేజీలకు దగ్గరలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌ల నుండి చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, మొదటి సంవత్సరం విద్యార్థులను వెంటనే ఆ కాలేజీని వదిలి ఇతర…
ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది విద్యాశాఖ. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ.. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు…
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచింది. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచి, ఛాయిస్‌గా వదిలేసుకొనే అవకాశం కల్పించింది. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు. గత ఏడాది మూడు సెక్షన్లకు…
తెలంగాణలో ఇంటర్ పరీక్షలను మే 2 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్తూ వచ్చిన ఇంటర్ బోర్డు.. కరోనా కారణంగా ఆఫ్‌లైన్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడం, థర్డ్ వేవ్ దృష్ట్యా మే నెలలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు మే 2న పరీక్షలను ప్రారంభించి 20వ తేదీకి పూర్తయ్యేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. మరోవైపు ఇటీవల ఇంటర్ ఫస్టియర్‌లో 2.35 లక్షల మంది విద్యార్థులు తప్పగా… ప్రభుత్వం…
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు మరో గుడ్‌న్యూస్ అందించింది. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసిన వారు.. తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీలలోని ప్రిన్సిపాళ్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది.…
తెలంగాణలో ఇంటర్ విద్యార్దులు ఫస్టియర్ విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్ కావడంతో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, కాంగ్రెస్.. ఇతర విద్యార్ధి సంఘాలు ఇంటర్ బోర్డుపై వత్తిడి తెచ్చాయి. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 35 మార్కులతో ఫెయిలైన విద్యార్థులందరినీ… పాస్ చేస్తున్నట్లు తెలిపారు. మినిమమ్ మార్కులు వేసి.. ఈ సారి పాస్ చేస్తున్నట్లు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నేపథ్యంలో తమ ఉద్యమ ఫలితంగా ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వంలో కదలిక…