దేశవ్యాప్తంగా ఎండలు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.వేసవి తాపానికి తాళలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. అయితే, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rise In Temperature: ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. అయితే రాబోయే 5 రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు దంచి కొట్టనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఉరుములు, బలమైన ఈదురుగాలులతో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్-2లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్నాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్ లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను సాధిస్తోందని, ప్రపంచం దేశం వైపు చూస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు.
Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరగుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం వెయ్యిలోపే ఉండే రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం 5 వేలను దాటింది. గురువారం ఏకంగా కేసుల సంఖ్య 5,000లను దాటిపోయింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. అయితే ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలకు కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB1.16 కారణం అవుతోంది.