Free Insurance: ఆంధ్రప్రదేశ్లో 79 లక్షల మంది కార్మికులకు ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.. కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్ లో 2023 మార్చి 27 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 79,54,498 మందితో పాటు దేశవ్యాప్తంగా 28,78,93,401 మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నారని, వీరందరికీ మొదటి ఏడాది రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్…
Foreign Exchange: కరోనా ప్రపంచదేశాలను అతలాకుతలం చేసింది.. మళ్లీ కొన్ని దేశాలు మినహా చాలా దేశాల్లో సాధారణ పరిస్థితులు సారవడంతో.. విదేశీయానం పెరిగింది.. భారత్కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. విదేశీ పర్యాటకుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఒక లక్షా 34 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు..…
India Oil Exports: గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా ఆయిల్ తో వ్యాపారం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు ప్రస్తుతం ఆయిల్ కోసం భారత్ ను ఆశ్రయిస్తున్నాయి. యుద్ధాన్ని చూపిస్తూ యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపేశాయి. దీంతో పాటు రష్యా క్రూడ్ ఆయిల్ ధరపై ధర పరిమితిని విధించాయి.
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఐఫోన్, ఉత్పత్తులపై భారతీయుల క్రేజ్ అందరికీ తెలిసిందే. దేశంలో కంపెనీ అమ్మకాలు పెరగడానికి అదే కారణమని చెప్పవచ్చు. యాపిల్ తన మొట్టమొదటి రిటైల్ స్టోర్ను భారతదేశంలో త్వరలో ప్రారంభించనుంది.
Corona Cases In India: దేశంలో నెమ్మదిగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,435 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ చివరి నాటితో పోలిస్తే ఇప్పుడే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. 163 రోజులలో ఈ రోజే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం చివరిసారిగా గతేడాది…
Arunachal Pradesh: భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పేర్లు మార్చడం ద్వారా వాస్తవ పరిస్థితిని మార్చలేరని, చైనా తీరును ఖండించింది భారత్. చాలా ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని దక్షిణ టిబెట్ పేరుతో పలుస్తోంది చైనా. ఇంతకుముందు కూడా రెండు సార్లు ఇలాగే పేర్లను మార్చింది.
Anti-India agenda: భారత్ అంటేనే నిలువెల్ల విషంలో మాట్లాడుతుంటుంది ముస్లిం దేశాల కూటమి ‘‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)’’. ఇప్పటికే పలుమార్లు భారత అంతర్గత విషయాలపై స్పందిస్తూ ఇండియాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసింది. అయితే ఎప్పటికప్పుడు ఐఓసీ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రామనవమి అల్లర్లపై ఓఐసీ అర్థపర్థం లేని ఆరోపనలు చేసింది. దీంతో మరోసారి తీవ్రంగా స్పందించింది భారత్.