పాకిస్థాన్ పరువు పోతోంది… ప్రభుత్వంపై ఇమ్రాన్ తీవ్ర విమర్శలు
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి షెషబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీలపై విరుచుకుపడ్డారు. ప్రధాని, విదేశాంగమంత్రులు విదేశీ పర్యటనపై ప్రశ్నలు గుప్పించారు. షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం కోసం యూకేలో ఉండగా, విదేశాంగ మంత్రి బిలావల్ గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొనడానికి గురువారం భారతదేశాన్ని సందర్శించారు. ఇమ్రాన్ ఖాన్ లాహోర్ లో ఓ ర్యాలీలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ కు మద్దతుగా ఈ సంఘీభావ ర్యాలీ జరిగింది. ప్రపంచంలో పాకిస్తాన్ పరవుపోతోందని, బిలావల్ భుట్టో మీరు ప్రపంచం మొత్తం పర్యటిస్తున్నారు, ఈ పర్యటనలకు పాకిస్తాన్ డబ్బు ఖఱ్చు చేస్తున్నారు.. అయితే ఈ పర్యటనల వల్ల దేశానికి ఏం ఒనగూరుతోంది..? లాభ నష్టాలు ఏంటి..? అని ప్రశ్నించారు. భారత పర్యటనతో భుట్టో ఏం సాధించారని ప్రశ్నించారు.దాయాది దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ ప్యాకేజీని సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు, ఒక వేళ ఉన్నా రేట్లు చుక్కలను అంటుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు రాజకీయ అస్థిరత పాకిస్తాన్ లో రాజ్యం ఏలుతోంది. ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఇక ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకోవాలి
విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘనంగా జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు క్షత్రియ సమితి సభ్యులు.తెలుగు ప్రజల ఖ్యాతి, విప్లవ జ్యోతి, స్వాతంత్ర్య సమర యోధుడు
అల్లూరి సీతారామ రాజు వర్థంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. వివిధ కూడళ్ళలో ఉన్న అల్లూరి సీతారామరాజు నిలువెత్త విగ్రహాలకు పూలమాలలు వేసి, ఆయన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ అల్లూరి సీతారామ రాజు సర్కిల్ లో గల అల్లూరి విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని వారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి శౌర్య ప్రతాపాలను కొనియాడారు. స్వాతంత్ర్య భారత సంగ్రామంలో శివాజీ తరువాత అంతటి పోరాట పటిమ కనపరచిన మహావీరుడు అల్లూరి సీతారామ రాజు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జానకి రామరాజు, డా॥ ఎమ్ ఆర్ ఎస్ రాజు, సాయి రాజు, కృష్ణం రాజు, గోపాల కృష్ణం రాజు, గుణరంజన్ సాయి, రామకృష్ణం రాజు(ఆర్కే), శ్రీనివాస రాజు, భాస్కర రాజు, రామచంద్ర నాయక్, అబ్దుల్ నబీ, వై వీ రావు, రామ రాజు, అల్లూరి మనవడు అల్లూరి శ్రీరామ రాజు, కుందన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులు అర్పించిన నేతలు.. యువత పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.
మణిపూర్ లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వం సాయం
మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను సురక్షితంగా స్వస్ధలాలకు పంపించేందుకు ముమ్మరంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటుకు అంగీకరించింది సివిల్ ఏవియేషన్ శాఖ. మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 100 మంది ఏపీ విద్యార్ధులు మణిపూర్‌లో చదువుతున్నట్టు గుర్తించారు. వీరిని ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. వ్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు. ఇటు అనంతపురంలో మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్న అనంతపురం పట్టణానికి చెందిన విద్యార్ధిని యజ్ఞ శ్రీ ఆందోళన చెందుతుంది. ఈమేరకు యజ్ఞ శ్రీ ఎన్టీవీతో ఆవేదన పంచుకుంది. మణిపూర్ లోని ఎన్. ఐ. టీ లో సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది యజ్ఞ శ్రీ. అల్లర్ల నేపధ్యంలో తమ పాప ఎలా ఉందో అని ఆందోళన చెందుతున్నారు ఆమె తల్లిదండ్రులు. మంచి నీళ్ళలో విషం కలిపారని…. ఎన్ ఐ టీ లో కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకడం లేదని పేరెంట్స్ కు చెప్పింది యజ్ఞ శ్రీ. తమ పాపతో పాటు… మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులను సురక్షితంగా తీసుకురావాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.
తెలుగు విద్యార్ధులను ఆదుకోవడంలో జగన్ విఫలం
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మణిపూర్ లో ఉన్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడటంపై లేదా ?టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంది.జగనుకి తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా ?రంగులు వేయటం కోసం, మీ ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు గానీ.. ఆపదలో ఉన్న విద్యార్థులను ఆదుకోరా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక విమానాల్లో తిరిగే సీఎం.. మణిపూర్ లో ఉన్న తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఒక విమానం కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్ని వెంటనే తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను మణిపూర్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక విమానంలో అధికారులు విద్యార్ధులను తరలిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్టు కు ఆ విమానం చేరుకోనుంది. మణిపూర్‌లో నివసిస్తున్న ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
భార్య ఘాతుకం.. ప్రియుడితో కలిసి దారుణం
వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్నాయి. ప్రియురాలి కోసం ప్రియుడు, ప్రియుడి కోసం ప్రియురాలు కర్కశులుగా మారుతున్నారు. కట్టుకున్నవారిని, కలకాలం కలిసి వుందామని వచ్చిన వారికి కాటికి పంపుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. భార్యే భర్తను కటతేర్చింది. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడుతో కలిసి భర్తను చంపింది భార్య. గత ఏడాది నవంబరులో జరిగిన హత్య కేసులోమిస్టరీ చేధించిన పోలీసులు అసలు నిందితుల వివరాలు వెల్లడించారు.అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో వర్మి కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రం నిర్వహించాడు రవిశంకర్. అదిలాబాద్ కు చెందిన గజానంద్ ను అతని భార్య ఊర్మిళను పనిలో పెట్టుకున్నాడు రవిశంకర్. రవిశంకర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది గజానంద్ భార్య ఊర్మిళ. ఇద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను చంపి వర్మీ కంపోస్టు షెడ్ లో పాతిపెట్టింది భార్య ఊర్మిళ ,ప్రియుడు రవిశంకర్.. గత ఏడాది నవంబరు 23న గజానంద్ ను చంపేసింది భార్య ఊర్మిళ, ప్రియుడు రవిశంకర్. గజానంద్ కనిపించకపోవడంతో హైదరాబాదులోని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో తండ్రి ఫిర్యాదు చేశాడు. ఆ కేసును అంబాజీపేట స్టేషన్ కి బదిలీ చేశారు. రవిశంకర్, ఊర్మిళను అదుపులోకి తీసుకుని విచారించగా వెలుగులోకి వచ్చింది అసలు విషయం. రవిశంకర్, ఊర్మిళ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు కొత్తపేట డీఎస్పీ వెంకటరమణ.
గ్రామశివారులోనే గర్భవతి మృతదేహం.. ఏమైందంటే?
చిన్న చిన్న కారణాలు ఒక్కోసారి దారుణమయిన ఘటనలకు కారణం అవుతున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలు ఆత్మహత్యలకు, హత్యలకు దారితీస్తాయి. తాజాగా ఓ గర్భవతి ఆత్మహత్య చేసుకుంది. గ్రామం కట్టుబాట్లతో ఆ గర్భవతి మృతదేహాన్ని ఊరిలోకి అనుమతించలేదు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా దేవనకొండ( మం) వరిముక్కలలో అంత్యక్రియల కోసం గర్భవతి మృతదేహం ఎదురుచూస్తోంది. గ్రామ వాలంటీర్ సరోజ(32) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సరోజ నాలుగు నెలల గర్భవతి. కర్నూలులో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. భర్త జగన్, అత్తమామలు వేధింపులే కారణమంటున్నారు బంధువులు. ధ్వజస్తంభ ప్రతిష్ట ఉండడంతో గ్రామంలో అంత్యక్రియలు చేయరాదని సంప్రదాయం ఉంది. దీంతో రాత్రి నుంచి గ్రామం బయట గర్భవతి మృతదేహాన్ని అంబులెన్సు లో ఉంచారు బంధువులు. మృతురాలు సరోజకు తల్లిదండ్రులు లేరు. భర్తను పోలీసులు తీసుకువస్తేనే అంత్యక్రియలు చేస్తామని పట్టుబడుతున్నారు బంధువులు. దీంతో అంబులెన్స్ లోనే సరోజ మృతదేహం అంత్యక్రియలు చేయడానికి వీలుపడడం లేదని అంటున్నారు. బంధువులు మాత్రం భర్తపై కేసు నమెదుచేయాలంటున్నారు.
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు… సాప్ట్‌వేర్ ఉద్యోగి మృతి
రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ అనూహ్య సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంలో శనివారం ( మే 6 ) జరిగింది. మృతుడు మర్రిపూడి మణికంఠది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామమని మహేశ్వరం ఎస్సై నర్సయ్య వెల్లడించారు.మృతుడి సోదరుడు వెంకటేష్ కేబీహెచ్‌పీ కాలనీలో నివాసం ఉంటూ స్టాప్ట్‌వేర్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. మణికంఠ ఏడాది నుంచి కేబీహెచ్‌పీ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి సొదరుడు వెంకటేష్ మాట్లాడుతూ.. వారంతంలో తామిద్దరం మరికొంతమంది స్నేహితులతో కలిసి స్టేడియంలో క్రికెట్ ఆడుతుంటామని తెలిపారు. మణికంఠ శనివారం ఉదయం ఘట్టుపల్లి శివారులోని స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వెళుతున్నట్లు చెప్పాడన్నారు. తర్వాత మధ్యాహ్నం సోదరుడి స్నేహితుడు యశ్వంత్ తనకు ఫోన్‌చేశాడని, మణికంఠ బ్యాటింగ్ అనంతరం ఒకే ఓవర్ బౌలింగ్ వేసి వెన్నునొప్పి వస్తుందంటూ విశ్రాంతి కోసం కారులో పడుకున్నట్లు చెప్పాడన్నారు. కాసేపటి తర్వాత వెళ్లి మణికంఠను పిలిచినా పలకకపోవడంతో వెంటనే మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపారు. మణికంఠ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు. దీంతో మృతుడి ఇంట్లో తీవ్ర విషాదచాయాలు అలుముకున్నాయి. మృతుడు మర్రిపూడి మణికంఠ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అబ్బో.. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారుగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడినప్పుడు.. ఆర్సీబీ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మధ్య చాలా టెన్షన్ నెలకొంది. ఆ మ్యాచ్ కు సంబంధించిన అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో కోహ్లీ గుంగూలీపై దూకుడు చూపుతున్నట్లు కనిపించింది. అయితే మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. అయితే శనివారం (మే6) రాత్రి ఇరు జట్లు మళ్లీ తలపడడంతో అభిమానులు మరోసారి హైవోల్టేజ్ డ్రామాను చూడటానికి వేచి ఉన్నారు. మ్యాచ్ లో ప్రతి అభిమాని చూపు కోహ్లీ-దాదా వైపే చూస్తున్నారు. అదే సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈసారి షేక్ హ్యాండ్ ఇస్తారా లేదో చూడాలని అంతా అనుకున్నారు. కానీ ఈసారి అలాంటిదేమీ జరుగలేదు. ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ-సౌరబ్ గంగూలీ ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్ హాఫ్ సెంచరీలతో ఆధారంగా బెంగళూరు 181 పరుగులకు ఆలౌట్ అయింది.