అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని స్టేడియాలను పూర్తిగా న్యూ లుక్ లో కనిపించేలా కసరత్తులు చేస్తోంది. దీని కోసం రూ. 500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయనుంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. తాము కూడా భారత్ లానే రష్యా నుంచి చౌకగా క్రూడ్ ఆయిల్ ని పొందాలని కోరుకుంటున్నామని చెప్పారు. కానీ తన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కూలిపోవడంతో అలా చేయలేకపోయామని చెప్పారు.
భారతదేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ఎక్స్ఎల్6 ఎక్స్-షోరూమ్ ధరలను గణనీయంగా పెంచింది. XL6 కారు ధరను కంపెనీ భారీగా పెంచింది. మారుతి సుజుకి భారత మార్కెట్లో విక్రయించే అత్యంత ఖరీదైన కార్లలో XL6 ఒకటి.
కుక్కలు అంటూనే బాబోయ్ అంటున్నారు ప్రజలు. కుక్కలను చూడగానే ఆమడదూరంలో పరుగెడుతున్నారు. వీధిల్లో తిరగాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఇక.. దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్క కాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.