Pak Flight: భారత గగనతలంలోకి పాక్ విమానం.. వర్షం దెబ్బకు దారి తప్పిందట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Flight: పాకిస్థాన్‌కు చెందిన ఓ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ల్యాండింగ్ సమస్య కారణంగా పది నిమిషాల పాటు మన దేశ పరిధిలో చక్కర్లు కొట్టింది. పేలవమైన వాతావరణం వల్ల పాక్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడంతో వైమానిక దళం నిఘా ఉంచింది. ఆ సమయంలో పైలట్.. విమానాన్ని 23 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఓ మీడియా ప్రచురించడం వల్ల వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడం విఫలమైన తర్వాత.. గత వారం భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 జెట్‌లైనర్‌ను భారత వైమానిక దళం నిశితంగా పరిశీలిస్తోంది.
మే 4న, పాకిస్తానీ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఫ్లైట్ బోయింగ్ 777 (పీకే-248) మస్కట్ నుంచి లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. ఆ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌ను నిలిపివేయవలసి వచ్చింది. అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు లాహోర్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ సమయంలో లాహోర్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ విమానం ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తమైందని, ఆ ప్రాంతంలోని వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బోయింగ్‌ను పక్కదారి పట్టించాలని అభ్యర్థనను ప్రాసెస్ చేసినట్లు తెలిసింది.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
Read Also: Tamil Nadu Cops: తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ హత్య.. ఏడుగురు తమిళనాడు పోలీసులపై సస్పెన్షన్ వేటు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలు మేరకు పైలట్, గో- అరౌండ్ విధానాన్ని ప్రారంభించాడు. లాహోర్ పరిసరాల్లో చక్కర్లు కొట్టాడు. వర్షం భారీగా కురుస్తుండడం, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉండడం వల్ల దారి తప్పి భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది. ఆ సమయంలో 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాన్ని 23వేల అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లాడు. పంజాబ్‌లోని తరణ్ సాహిబ్, రసూల్‌పుర్ నగరం గుండా వివిధ ప్రాంతాల్లో ప్రయాణించిన ఆ విమానం కాసేపటికి తిరిగి పాకిస్థాన్‌లోని ముల్తాన్‌కు చేరుకుంది. మొత్తం భారత్ గగనతలంలో దాదాపు పది నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన పాక్ విమానం.. 120 కిలోమీటర్లు మేర ప్రయాణించింది. లాహోర్ భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్నప్పటికీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లు ఎల్లప్పుడూ విమానాల సురక్షిత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!