Covid-19: ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న 10,000లను దాటిని కేసుల సంఖ్య, ఈ రోజు 11,000లను దాటింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 9 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రస్తుతం 49,622కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించిన డేటా ప్రకారం..
S Jaishankar: భారతదేశాన్ని ఇరకాలంలో పెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా చీటికి మాటికి సరిహద్దు వివాదాలు, సీమాంతర ఉగ్రవాదాలను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాక్ లను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది విభిన్న భారతదేశం అని, దేశ భద్రతకు ముప్పు వస్తే వారికి గట్టి బదులిస్తాం అంటూ
The New Symptom Of The XBB.1.16 Variant: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరో కొన్ని 10 నుంచి 12 రోజుల వరకు కోవిడ్ కేసుల సంఖ్య పెరగుతూనే ఉంటుందని, ఆ తరువాత తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.
దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకి తీవ్రం అవుతోంది. కరోనా మహమ్మారికి మళ్లీ ప్రమాద గంటికలు మోగిస్తోంది. కొత్త వేరియంట్ల రూపాన్ని సంతరించుకున్న వైరస్ మళ్లీ విజృంభిస్తోంది.
Covid 19: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. గత ఐదారు నెలలుగా స్తబ్ధుగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం మళ్లీ పెరుగుతన్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం కేసులు 1000 లోపే పరిమితం అయ్యేవి, కానీ కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ.. 5000 మించి నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ ఎండమిక్ స్టేజ్ లో ఉందని, మరో 10-12 రోజుల వరకు కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు…
Pro-Khalistan Elements Misusing Asylum Policy, India Tells UK: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. ఈ విషయం తెలిసిన విదేశాల్లోని ఖలిస్తానీవాడులు భారత రాయబార కార్యాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీవాదులు భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ.. ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్స్ పై దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది.
రష్యా దాడితో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ ఇప్పుడు ఇతర దేశాల సాయాన్ని కోరుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖను భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి పంపారు.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి వరకు ఆరు వేలలోపు నమోదు అయిన కేసులు తాజాగా 8 వేల చేరువ అయ్యాయి. భారత్లో గత 24 గంటల్లో 7,830 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.
దాయాది దేశం పాకిస్థాన్ మాట మార్చింది. భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడడానికి.. ఆ దేశ క్రికెట్ బోర్డు వేదికలను ఎంపిక చేసుకుంటుంది. ఇండియాలోని 12 నగరాల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీలో భద్రతా కారణాల దృష్ట్యా తాము చెన్నై, కోల్ కతా వేదికల్లోనే అన్ని మ్యాచ్ లు ఆడతామని పాకిస్థాన్ చెబుతుంది.
Arunachal Pradesh: భారతదేశంలో అంతర్భాగం అయిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై చైనా తన గుప్పిట్లోకి తీసుకోవాలని అనుకుంటోంది. అయితే ఎప్పటికప్పుడు భారత్ అరుణాచల్ విషయంలో చైనా వైఖరిపై దృఢంగా వ్యవహరిస్తోంది. ఇటీవల డ్రాగన్ కంట్రీ అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లను మార్చింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేర్లు మార్చినంత మాత్రాన అరుణాల్ మీదైపోదంటూ ఘాటుగానే బదులిచ్చింది.