Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి షెషబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీలపై విరుచుకుపడ్డారు. ప్రధాని, విదేశాంగమంత్రులు విదేశీ పర్యటనపై ప్రశ్నలు గుప్పించారు. షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం కోసం యూకేలో ఉండగా, విదేశాంగ మంత్రి బిలావల్ గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొనడానికి గురువారం భారతదేశాన్ని సందర్శించారు.
Read Also: PM Modi: బెంగళూర్‌లో రెండో రోజు ప్రధాని మెగా రోడ్ షో..
ఇమ్రాన్ ఖాన్ లాహోర్ లో ఓ ర్యాలీలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ కు మద్దతుగా ఈ సంఘీభావ ర్యాలీ జరిగింది. ప్రపంచంలో పాకిస్తాన్ పరవుపోతోందని, బిలావల్ భుట్టో మీరు ప్రపంచం మొత్తం పర్యటిస్తున్నారు, ఈ పర్యటనలకు పాకిస్తాన్ డబ్బు ఖఱ్చు చేస్తున్నారు.. అయితే ఈ పర్యటనల వల్ల దేశానికి ఏం ఒనగూరుతోంది..? లాభ నష్టాలు ఏంటి..? అని ప్రశ్నించారు. భారత పర్యటనతో భుట్టో ఏం సాధించారని ప్రశ్నించారు.
దాయాది దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ ప్యాకేజీని సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు, ఒక వేళ ఉన్నా రేట్లు చుక్కలను అంటుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు రాజకీయ అస్థిరత పాకిస్తాన్ లో రాజ్యం ఏలుతోంది. ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఇక ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.