Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కి చెందిన ఫైటర్ జెట్‌లను భారత్ కూల్చివేసినట్లు ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీఏం) ఆదివారం తెలిపారు. ఫైటర్ జెట్లు ఏ జనరేషన్ అని ఖచ్చితంగా చెప్పకున్నా, హైటెక్ ఫైటర్ జెట్‌లను కూల్చేసినట్లు తెలిపారు. పాక్ విమానాలు మన సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా నిరోధించామని,
Indian Navy: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఈ రోజు త్రివిధ దళాల అధికారులు మీడియాకు వెల్లడించారు. ఉగ్రదాడి తర్వాత అరేబియన్ సముద్రంలో భారత నేవీని మోహరించినట్లు వెల్లడించారు. కరాచీతో సహా సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను చేధించేందుకు పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నట్లు నేవీ వైస్ అడ్మినరల్ ఎఎన్ ప్రమోద్ తెలిపారు.
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి చేసి ఏం అవుతుందిలే, భారత్ ఏం చేస్తుందిలే అనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు, దాడి ఎందుకు చేశామా..? అని బాధపడటం తథ్యం. ఎందుకంటే, భారత్ వైమానిక దాడుల్లో భారీ ఎత్తున పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత్ ఈ రేంజ్‌లో అటాక్ చేస్తుందని దాయాది ఊహించలేదు. ఉరి, పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత, భారత్ చేసినట్లు ఏదైనా చిన్న సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేస్తుందని అనుకుంది.
Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ గురించి త్రివిధ దళాల సైనికాధికారులు మాట్లాడారు. భారత సైన్యం మే 7-10 మధ్య జరిపిన ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 35-40 మంది చనిపోయినట్లు మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ శనివారం చెప్పారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తూ చేసినట్లు సైనికాధికారులు చెప్పారు.
India Pakistan Tension: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లయితే, ప్రతిఘటన తీవ్రంగా ఉండాలని దీని కోసం కమాండర్లకు ‘‘పూర్తి అధికారం’’ మంజూరు చేస్తూ ఆర్మీ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఈ మేరకు ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారం ఇచ్చారు. పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడితే,
PM Modi:పాకిస్తాన్ చర్చల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) తిరిగి పొందడం, ఉగ్రవాదుల అప్పగించపై మాత్రమే ఉంటుందని భారత్ అమెరికాకు స్పష్టం చేసింది. "కాశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) తిరిగి రావడం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉంది.
PM Modi: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది. రెండు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాలతో సుదీర్ఘం మాట్లాడి కాల్పుల విమరణకు ఒప్పించినట్లు ఆయన ప్రకటించారు.
China: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకే ప్రాంతాల్లోని తీవ్రవాద క్షేత్రాలపై దాడులు నిర్వహించింది. దీని తర్వాత, భారత్‌పైకి డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేసింది.
Operation Sindoor: పాకిస్తాన్ డ్రోన్ దాడి కారణంగా ఒక సైనికుడు అమరుడయ్యారు. డ్రోన్‌ని అడ్డగించిన సమయంలో దాని శకలాల్లో ఒకటి బలంగా తాకడంతో జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. శనివారం, జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలోని వైమానిక స్థావరంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డ్రోన్‌ని విజయవంతంగా అడ్డగించింది. అయితే, డ్రోన్ శిథిలాలు సురేంద్ర సింగ్ మోగ అనే సైనికుడిని బలంగా ఢీకొట్టాయి. దీంతో తీవ్రగాయాలైన అతను మరణించాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సురేంద్ర సింగ్ విధుల్లో…