Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తూ చేసినట్లు సైనికాధికారులు చెప్పారు. పహల్గామ్ దాడి తర్వాత బాధితుల కుటుంబాల ఆవేదనను దేశం మొత్తం చూసిందని వారు చెప్పారు. పాకిస్తాన్‌లోని మొత్తం 09 టెర్రర్ క్యాంపుల్లో కొన్ని పీఓజేకే, పాక్ పంజాబ్‌లో ఉన్నట్లు చెప్పారు. ప్రతీ లొకేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించి నేలమట్టం చేసినట్లు మిలిటరీ డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.
అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ వంటి వారికి శిక్షణ ఇచ్చిన మురిడ్కే వంటి స్థావరాలను టార్గెట్ చేసినట్లు సైనికాధికారులు చెప్పారు. ఐసీ 814 విమాన హైజాక్‌లో పాల్గొన్న ఉగ్రవాదులను చంపేసినట్లు వెల్లడించారు. వీరిలో కరగుట్టిన ఉగ్రవాదులు యూసఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదస్సిర్ అహ్మద్ వంటి వారిని హతం చేసినట్లు చెప్పారు. పుల్వామా టెర్రర్ అటాక్‌కి పాల్పడిన వారిని కూడా హతమార్చినట్లు తెలిపారు.
Read Also: Budget Phones: రూ.15,000 లోపే అదిరిపోయే ఫీచర్స్ తో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇదిగో..!
బహవల్పూర్, మురిడ్కే వంటి క్రూరమైన ఉగ్రశిబిరాలను నాశనం చేసినట్లు ఎయిర్‌ఫోర్స్ డీజీఎంఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు. ఎయిర్ టూ సర్ఫేస్ క్షిపణులను ఉపయోగించినట్లు వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా క్షిపణల్ని ప్రయోగించి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఉగ్రవాద శిభిరాల్లో ఉన్న 100కు పైగా టెర్రరిస్టుల్ని హతం చేసినట్లు వెల్లడించారు. పాకిస్తాన్ మిలిటరీ పౌరులు, మిలిటరీ స్థావరాలపై దాడులకు ప్రయత్నించినట్లు చెప్పారు
‘‘మురిద్కేలో 4 టార్గెట్స్‌పై కచ్చితత్వంతో దాడి చేశాం డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను భారత భూభాగంపై పాక్ ప్రయోగించింది.. 8,9 తేదీల్లో శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడి చేశారు.. పాక్ డ్రోన్లు, UAVల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాం.. ఉగ్రవాదులు, వారికి సంబంధించిన స్థలాలను మాత్రమే టార్గెట్ చేశాం’’ అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు.