నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో గతంలోనూ ఎన్నో సార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నారు.. కానీ, అవి ఎంతో కాలం పని చేయలేదు.. కొద్ది రోజులకే పాక్ మళ్లీ కాల్పులకు దిగిందని పేర్కొంటున్నారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత పాకిస్తాన్ భారత సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాలలో భారీ షెల్లింగ్‌కు పాల్పడుతోంది. భారత్ కూడా పాకిస్తాన్ కు దీటైన సమాధానం ఇస్తోంది. అయితే యుద్ధం వేళ కొన్ని పదాలు వినిపిస్తుండడంతో వీటి అర్థాలు ఏంటా అని ఆరా తీస్తున్నారు. ఎల్ఏసీ, ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు, ఎయిర్ డిఫెన్స్ సిస్టం వంటి పదాల అర్థాలు తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ పదాల వివరాలు మీకోసం.. Also Read:Operation…
Pak Cyber Attack: పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్‌పై సైబర్ దాడికి ప్రయత్నిస్తోందని ఇంటలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, ఈ-మెయిల్‌ల ద్వారా ‘డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ’ అనే ప్రమాదకరమైన వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు ట్రై చేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది.
గత నాలుగు రోజులుగా క్షణ క్షణం టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. పాక్ పై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టింది. భారత్ పాక్ వార్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ తో పాటు మరో ఇద్దరు వీరమరణం పొందారు. ఏపీ(AP)లోని సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్ జమ్ము కశ్మీరులోని LOC వద్ద పాకిస్తాన్ తో…
భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించామని తెలిపారు. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఏం చేసేందుకు అయినా వెనుదిరిగేది లేదన్నారు. పాకిస్తాన్ ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు.
IND PAK War: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. ఆయన ఈ ప్రకటనను తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. అలాగే, ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాల్లోనే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. రెండు దేశాల సైనిక ఆపరేషన్ల డైరెక్టర్లు మధ్య మే 10వ తేదీ సాయంత్రం 3:35 గంటలకు మాట్లాడారు.…
ఈ రోజు పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందారు.. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు.. సచిన్ యాదవ్ రావు వనాంజే వయస్సు 29 ఏళ్లు.. ఆయన స్వస్థలం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్... సచిన్ యాదవ్‌రావు వనాంజే మృతితో తమ్లూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి..
India Pak War: భారత్‌పై పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో చేస్తున్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీనగర్‌లో మరోసారి భీకరమైన పేలుళ్లు సంభవించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పేలుళ్ల శబ్దం వినగానే అధికారులు వెంటనే పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను…
IND-PAK Tension: భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో హైలెవల్ మీటింగ్ కొనసాగుతుంది.
ఓవైపు దాడులు చేస్తూనే.. మరోవైపు భారత్‌లో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తోంది.. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్.. భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు.. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించారు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపితే.. తామూకూడా ఆపుతాం అని వెల్లడించారు.. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం అని పేర్కొన్నారు.