PM Modi:పాకిస్తాన్ చర్చల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) తిరిగి పొందడం, ఉగ్రవాదుల అప్పగించపై మాత్రమే ఉంటుందని భారత్ అమెరికాకు స్పష్టం చేసింది. “కాశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) తిరిగి రావడం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉంది. ఇంకేమీ మాట్లాడటానికి లేదు. ఉగ్రవాదులను అప్పగించడం గురించి వారు మాట్లాడితే, మనం మాట్లాడుకోవచ్చు. మాకు వేరే ఏ అంశం ఉద్దేశం లేదు.భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించాలని మేము కోరుకోవడం లేదు.’’ అనే విషయాన్ని ప్రధాని మోడీ, అమెరికాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Read Also: PM Modi: PoK, ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే చర్చలు.. భారత్ సందేశం..
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యటాకులను పాక్ ప్రేరేపిత లష్కరేతోయిబా ఉగ్రవాదులు హతమార్చారు. దీనికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పీఓకే, పాకిస్తాన్ లోని జైషేమహ్మద్, లష్కరేతోయిబా ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఆ తర్వాత పాక్ డ్రోన్లతో, క్షిపణులతో భారత్‌పైకి దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున భారత్ పాకిస్తాన్‌లోని కీలక ఆర్మీ, వైమానిక స్థావరాలపై భారీ దాడులు చేసింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ చర్చల్లో యూఎస్ వైస్ ప్రెసిడెండ్ జేడీవాన్స్ కీలకంగా వ్యవహరించారు. ఆయన ప్రధాని మోడీతో ఒప్పందం గురించి మాట్లాడారు. అయితే, భారత్ తన నిర్ణయాన్ని జేడీ వాన్స్‌కి స్పష్టం చేసింది. మరోసారి పాకిస్తాన్ దాడికి తెగబడితే, చాలా దారుణమైన ప్రతిదాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని మోడీ జేడీ వాన్స్‌కి తెలిపారు. గత 40 ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి కారణమవుతోందని చెప్పారు.