Indus Water Treaty: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్ర ఘటనకు పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాల్పడినట్లు తేలింది. పాకిస్తాన్ దేశంలో 80 శాతం మంది ప్రజలకు ఈ సింధు నది, దాని ఉపనదుల జలాలే జీవనాధారం. ప్రస్తుతం, ఈ ఒప్పందాన్ని నిలిపేయవద్దని పాకిస్తాన్ భారత్‌ని కోరుతోంది. ఇదిలా ఉంటే, భారత్ మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత కాలం ఈ…
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ నాశనం చేసిన ఉగ్రవాద నెట్వర్క్‌ని పాకిస్తాన్ పునర్నిర్మంచడానికి ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక యోధుల తెగువను ఆయన ప్రశంసించారు. భుజ్ వైమానిక స్థావరంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాది అయిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం రూ. 14 కోట్లను ప్రటించిందని, పాకిస్తాన్‌కి రుణం ఇచ్చే అంశాన్ని ఐఎంఎఫ్ పునరాలోచించాలని…
BrahMos: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పూర్తిగా పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించిందని యూఎస్ యుద్ధరంగ నిపుణుడు కల్నల్(రిటైర్డ్) జాన్ స్పెన్సర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారతదేశం దాడి ,రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని ఆయన అన్నారు. భారత్ పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశాన్ని అయినా ఎప్పుడైనా, ఎక్కడైనా ఢీకొనగలమనే సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశ బ్రహ్మోస్ క్షిపణులను తట్టుకోలేదని ఆయన చెప్పారు.
భారత్-పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు చెప్పారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ తన త్రివిధ దళాల శక్తిని పాకిస్తాన్‌కి రుచిచూపించింది. పాక్‌తో పాటు దాని ఇద్దరు మిత్రులు చైనా, టర్కీలకు కూడా దెబ్బ తగిలింది. అయితే, మే 9-10 రాత్రిలో భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. 13 పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ సైన్యం నడ్డి విరిచింది. అయితే, ఈ ఆపరేషన్ నిర్వహించడానికి భారత్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Operation Sindoor: భారతదేశం ఇటీవల పాకిస్తాన్‌పై చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’కి భయపడిందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భారతదేశం, పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో ‘‘కాళ్ల మధ్య తోకతో భయపడిన కుక్కలా పాకిస్తాన్ కాల్పులు విరమణ కోసం ప్రయత్నించింది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలోగా ఉన్న రూబిన్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఎలా భయపడిందనే విషయాలను వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యం ఘోరంగా ఓడిపోయిందని అన్నారు.…
పాకిస్తాన్ కు సహకరించిన టర్కీ, చైనాపై ప్రతీకారం తీర్చుకోవడానికి భారతీయ వ్యాపారులు ఆ రెండు దేశాలకు చెందిన ఉత్పత్తులను స్వచ్ఛందంగా బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. టర్కీ పర్యాటక రంగంతో పాటు దిగుమతి ఉత్పత్తుల బహిష్కరణతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
Operation Sindoor: భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును “ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టేట్” (సీడీఎస్) అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు కలిశారు.
BSF Jawan Released: పాకిస్తాన్ రేంజర్లు గత నెల ఫిరోజ్‌పుర్ దగ్గర అదుపులోకి తీసుకొన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ సాహూను ఎట్టకేలకు రిలీజ్ చేశారు. అతడిని ఈ రోజు ఉదయం పంజాబ్‌లోని అటారీ సరిహద్దు వద్ద భారత దళాలకు అప్పగించినట్లు పీటీఐ పేర్కొంది.
India-China Conflict: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్నిప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ తిరస్కరించింది. చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యనించింది.