India Pakistan War: ఎయిర్ బేస్‌లపై దాడితో పాకిస్తాన్‌లో భయం.. ఆ తర్వాతే చర్చల ప్రతిపాదన..
- ఎయిర్ బేస్ లపై దాడితోనే పాకిస్తాన్ దిగివచ్చింది..
- వైమానిక దాడులతో పాకిస్తాన్‌లో వణుకు..
- ఆ తర్వాతే చర్చల ప్రతిపాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి చేసి ఏం అవుతుందిలే, భారత్ ఏం చేస్తుందిలే అనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు, దాడి ఎందుకు చేశామా..? అని బాధపడటం తథ్యం. ఎందుకంటే, భారత్ వైమానిక దాడుల్లో భారీ ఎత్తున పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత్ ఈ రేంజ్‌లో అటాక్ చేస్తుందని దాయాది ఊహించలేదు. ఉరి, పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత, భారత్ చేసినట్లు ఏదైనా చిన్న సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేస్తుందని అనుకుంది.
Read Also: Tri Series: సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన.. ఫైనల్లో శ్రీలంక పై ఘన విజయం..!
Also Read
కానీ, భారత్ ఈ రేంజ్‌లో తమను నాశనం చేస్తుందని పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అనుకోలేదు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం, మే 09 భారత్ జరిపిన వైమానిక దాడులు, మే 10న పాకిస్తాన్ మిలిటరీ, ఎయిర్ బేస్‌లను నాశనం చేసిన తర్వాతే పాకిస్తాన్‌కి అర్థమైంది. ఈ దాడులతోనే పాకిస్తాన్ దారికి వచ్చి, కాల్పుల విమరణ, చర్చలకు సిద్ధమైందని తెలుస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడిన తర్వాత, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడారు. పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉందనే విషయాన్ని చెప్పారు. అయితే, భారత్ చర్చలు కేవలం DGMOల మధ్యే జరగాలి, మరెవరి మధ్యా కాదని భారతదేశం స్పష్టం చేసింది. మే 10న మధ్యాహ్నం 1 గంటలకు పాకిస్తాన్ DGMO, భారత DGMOతో మాట్లాడాలని అనుకున్నారు. దీనికి ముందు, భారత్ మే 07న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు పాకిస్తాన్ DGMOకి తెలియజేసిందని, కానీ ఆయన స్పందించలేదని తెలిసింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడి తర్వాతే ఆ దేశం దారికొచ్చినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?