భారత్-పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు చెప్పారు. తాజాగా ఖతార్ పర్యటనలో మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తాను ఆపలేదంటూ యూటర్న్ తీసుకున్నారు. కేవలం ఆమెరికాది పరోక్ష పాత్ర మాత్రమేనని.. రెండు దేశాల మధ్య సైనిక చర్చల వల్లే కాల్పుల అవగాహన జరిగిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: ఈటల రాజేందర్ బీజేపీలో ఒంటరి అయ్యారా?
ఖతార్‌లో అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో ఆర్మీని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘నేను భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకోవడం లేదు గానీ.. కచ్చితంగా ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాను. ప్రస్తుతం ప్రశాంతత నెలకొంది. రెండు దేశాలు వాణిజ్యంపై దృష్టిపెట్టాలని చెప్పాను. ప్రస్తుతం రెండు దేశాలు సంతోషంగా ఉన్నాయి.’’ అని ట్రంప్ అన్నారు.
ఇది కూడా చదవండి: Madras High Court: నిందితులు మాత్రమే పోలీస్ టాయ్‌లెట్స్‌లో ఎందుకు జారిపడుతున్నారు..?
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో భారీగా నష్టం జరిగింది. వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అలాగే 50 మంది సైనికులు కూడా చనిపోయారు. ఇక నియంత్రణ రేఖ వెంబడి జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. మొత్తానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయింది.