Operation Sindoor: 15 బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌లో విధ్వంసం.. ఇండియా ప్లాన్ అదుర్స్..
- ఆపరేషన్ సిందూర్‌లో ఇండియా ప్లాన్ అదుర్స్..
- 15 బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ ఎయిర్ బేస్‌లు ధ్వంసం..
- డమ్మీ జెట్‌లతో పాక్ రాడార్స్ గుర్తించిన ఇండియా..
- ఆ తర్వాత పాక్ ఎయిర్ డిఫెన్స్ నిర్వీర్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ తన త్రివిధ దళాల శక్తిని పాకిస్తాన్‌కి రుచిచూపించింది. పాక్‌తో పాటు దాని ఇద్దరు మిత్రులు చైనా, టర్కీలకు కూడా దెబ్బ తగిలింది. అయితే, మే 9-10 రాత్రిలో భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. 13 పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ సైన్యం నడ్డి విరిచింది. అయితే, ఈ ఆపరేషన్ నిర్వహించడానికి భారత్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Madras High Court: నిందితులు మాత్రమే పోలీస్ టాయ్‌లెట్స్‌లో ఎందుకు జారిపడుతున్నారు..?
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
ముందుగా, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కి సంబంధించి రాడార్లు, క్షిపణి వ్యవస్థల్ని యాక్టివేట్ చేసేలా, భారత వైమానిక దళం పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ఒక విధంగా చెప్పాలంటే డమ్మీ జెట్స్‌ని ఉపయోగించింది. దీంతో పాకిస్తాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయనేది భారత్‌కి తెలిసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ కావడంతోనే భారత్ హరోప్, కామికేజ్ డ్రోన్లను ఉపయోగించి వాటిపై దాడి చేసి, పాక్ ఎయిర్ డిఫెన్స్ పనిచేయకుండా చేసింది. ఈ వ్యూహంతో భారత్ పాకిస్తాన్‌కి చైనా ఇచ్చిన HQ-9 క్షిపణి బ్యాటరీలతో సహా దాని రాడార్‌ని నాశనం చేసింది.
దీని తర్వాత, భారత్ తన అమ్ములపొదిలోని బ్రహ్మోస్ క్షిపణితో పాటు స్కాల్ప్ వంటి క్షిపణుల్ని ఎయిర్ క్రాఫ్ట్‌ల ద్వారా ప్రయోగించి మొత్తం 11 పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. రిపోర్టుల ప్రకారం దాదాపుగా భారత్ 15 బ్రహ్మోస్ క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఒక ఘర్షణ సమయంలో భారత్ తొలిసారిగా బ్రహ్మో్స్‌ని వాడింది. ఈ దాడి భయంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తన విమాన స్థావరాలను మార్చాల్సి వచ్చింది. ఈ దాడిలో పాక్‌లో అత్యంత ముఖ్యమైన రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫికీ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, స్కర్దు, జకోబాబాద్ వంటి వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..