అసిమ్ మునీర్ భారత్ పై విషం కక్కుతూ పహల్గాం ఉగ్ర ఘటనకు కారణమయ్యాడు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. కాగా ఫీల్డ్ మార్షల్‌గా ఎన్నికైన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదివారం ఉన్నత స్థాయి విందు ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ నుంచి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టో వరకు, రాజకీయ, సైన్యం నుంచి అనేక మంది ఉన్నతాధికారులు విందులో…
Operation Sindoor: భారత్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు పాకిస్తాన్‌కి నొప్పి తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలతో పాటు దాని మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. ముఖ్యంగా, పాక్ వైమానిక దళానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంతో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’ అని అభివర్ణించారు.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి ప్రయత్నించింది అని GOC మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి ఈ రోజు మీడియాకు తెలిపారు. ఇక, గోల్డెన్ టెంపుల్ ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్‌లు, క్షిపణులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు.
Pakistan: పాకిస్తాన్ భారత్‌కి వ్యతిరేకంగా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’తో చావు దెబ్బలు తిన్నా కూడా తన పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని నియంత్రణ రేఖను సందర్శించినట్లు తెలుస్తోంది.
Shahid Afridi: భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా కూడా పాకిస్తాన్ తమకు ఏం కాలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజయోత్సవాలకు హాజరవుతున్నారు. భారత ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్లో పాకిస్తాన్ 11 ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. పీఓకే, పాక్ భూభాగాల్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందిని హతమార్చింది. అయినా కూడా ఏం జరగనట్లు పాకిస్తాన్ తన ప్రజల్ని మోసం చేస్తోంది.
భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన వార్తలపై భారత సైన్యం సంచలన ప్రకటన చేసింది. ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చలు జరగవని భారత సైన్యం స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఈరోజు ముగియబోతోందని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయని ఆర్మీ తెలిపింది. దీంతో దేశ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఊహాగానాలపై భారత సైన్యం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. Also Read:UP: పెళ్లైన…
India Armenia: భారత స్వదేశీ ఆయుధాల ముందు చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, చైనీస్ మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు నిలవలేవనే విషయం ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా ప్రపంచం చూసింది. పాకిస్తాన్ వినియోగించిన టర్కీ, చైనా రక్షణ ఆయుధాలు, వ్యవస్థల్ని భారత్ తుక్కుతుక్కు చేసింది. భారత్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసి వైమానిక రక్షణ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసింది. ‘‘ఆకాష్’’ సర్ఫేజ్ టూ ఎయిర్ మిస్సైల్స్ అత్యంత ఖచ్చితత్వంలో పాక్ వైమానికి ముప్పుని అడ్డుకున్నాయి. వీటిలో…
India Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంది. భారత్ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయి. భారత వాయు రక్షణ వ్యవస్థలు 600 కంటే ఎక్కువ పాకిస్తానీ డ్రోన్లను కుప్పకూల్చాయి. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద 1000 కంటే ఎక్కువ యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ గన్స్‌ని భారత్ మోహరించింది.
India Pakistan: ఎట్టకేలకు పాకిస్తాన్ క్రమంగా నిజాలను ఒప్పుకుంటోంది. తమపై భారత్ దాడి చేయలేదని, దాడి జరిగినా, పాకిస్తాన్ ఆర్మీ తిప్పికొట్టింది అంటూ విజయోత్సవాలు చేసుకున్న ఆ దేశ నేతలు నిజాలను వెల్లడిస్తున్నారు. తాజాగా, తమపై భారత్ క్షిపణులతో దాడులు చేసిందని, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. మే 10 తెల్లవారుజామున భారత్ బాలిస్టిక్ క్షిపణులతో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు ఇతర ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిందిన ఆయన బహిరంగంగా ప్రకటించారు.