భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన వార్తలపై భారత సైన్యం సంచలన ప్రకటన చేసింది. ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చలు జరగవని భారత సైన్యం స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఈరోజు ముగియబోతోందని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయని ఆర్మీ తెలిపింది. దీంతో దేశ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఊహాగానాలపై భారత సైన్యం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
Also Read:UP: పెళ్లైన ఆరు రోజులకే ఘోరం.. అందుకు ఒప్పుకోలేదని..
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ముగిసిన వార్త పూర్తిగా అబద్ధమని పేర్కొంది. మే 12న భారత్ పాకిస్తాన్ DGMOల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు తేదీని నిర్ణయించలేదని సైన్యం స్పష్టం చేసింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా, కొన్ని మీడియా సంస్థలలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఈరోజు ముగియబోతోందని వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. అవన్నీ నమ్మొద్దంటూ భారత సైన్యం ప్రకటించింది.