Mallikarjun Kharge: ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’.. మోడీకి ఉగ్రదాడి గురించి ముందే తెలుసు..
- ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’..
- ప్రధాని మోడీకి పహల్గామ్ ఉగ్రదాడి గురించి ముందే తెలుసు..
- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంతో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’ అని అభివర్ణించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందే ప్రధాని నరేంద్రమోడీకి సమాచారం ఉందని ఆరోపించారు. ఆ తర్వాతే ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే మరోసారి అన్నారు. దాడి జరిగే అవకాశం ఉందని ప్రజలకు ముందే ఎందుకు తెలియజేయలేదు అని ప్రశ్నించారు.
కర్ణాటకలో జరిగిన సమర్పణే సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఏప్రిల్ 17న కాశ్మీర్‌లో పర్యటించి ఉండాల్సింది, కానీ నిఘా వర్గాల సమాచారం మేరకు రద్దు చేసుకున్నారని, దీని గురించి మీకు ముందే తెలుసా..? అని ప్రధానిని ప్రశ్నించారు. దీని గురించి ఎందుకు ప్రజలకు సమాచారం ఇవ్వలేదు, ముందే హెచ్చరించి ఉంటే 26 మంది ప్రాణాలను కాపాడగలిగే వాళ్లం అని అన్నారు. ‘‘ఇప్పుడు అక్కడక్కడ చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ చైనా మద్దతుతో భారతదేశాన్ని తక్కువ అంచనా వేస్తోంది’’ అని అన్నారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
Read Also: Turkey: టర్కీ, అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు..
“26 మంది పౌరులు మరణించగా, ప్రధాని మోదీ బీహార్‌లో ర్యాలీ నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. రెండు అఖిలపక్ష సమావేశాలు జరిగాయి, ప్రధానమంత్రి కూడా హాజరు కాలేదు. మేము ఆ సమావేశాలకు దూరంగా ఉంటే, మమ్మల్ని దేశద్రోహులుగా పిలుస్తారు. కానీ మోదీ వాటిని సమావేశాలకు రాకుంటే, దానిని దేశభక్తిగా ముద్ర వేస్తారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?” అని ఖర్గే ప్రశ్నించారు.
ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా తీవ్రంగా స్పందించారు. దేశాన్ని, సాయుధ దళాల ధైర్యాన్ని మోసం చేయడమే అని అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ఒక చిన్న యుద్ధం అని ఖర్గే జీ చెబుతున్నారు. మన సాయుధ దళాలు పాకిస్తాన్‌లోకి ప్రవేశించి అక్కడ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయని, 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని రాహుల్ గాంధీ, ఖర్గే జీ అర్థం చేసుకోలేకపోతున్నారా? పాకిస్తాన్ 11 వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి, నేడు పాకిస్తాన్ బాధతో ఏడుస్తోంది.’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!