Pakistani YouTuber: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఒక వర్గం భారత్‌ని నాశనం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. పాక్ ప్రభుత్వంలోని మంత్రులతో పాటు రాజకీయ నాయకులు అర్థపర్థం లేని బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు, జర్నలిస్టులు కూడా పాకిస్తాన్ ప్రజల కోసం ప్రాపంగండా కథనాలు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కు చెందిన ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద ఘటనలో 26 మంది ప్రజలు చనిపోవడంతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌పై ప్రతీకారం కోసం చూస్తోంది. ఇప్పటికే, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. అయితే, పాక్ నేతలు మాత్రం ‘‘యుద్ధ భాష’’ మాట్లాడుతూ, భారత్‌ని హెచ్చరించే…
India Pak War: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ నేతలు భారత్ ఏ చర్య తీసుకున్నా, తమ ఆర్మీ ధీటైన జవాబు ఇస్తుందని బీరాలు పలుకుతున్నారు. తమ వద్ద అణ్వాస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బలహీనతల్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము లేదని విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి.
India-Pakistan War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దాయాది దేశానికి చెందిన కళాకారులు, ప్రముఖులకు సంబంధించిన యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లను భారతదేశం బ్లాక్ చేస్తుంది. ఈ సందర్భంగా పాక్ నటుడు ఫవాద్ ఖాన్, గాయకుడు అతిఫ్ అస్లాంల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేయబడింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్.. మరోసారి నెత్తురోడింది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి.. 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. దీని వెనక పాకిస్థాన్ ఉందని తేలిపోవడంతో దేశమంతా రగలిపోతుంది. యుద్ధం ప్రకటించి.. దాయాదికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మన సత్తా చూపాలని, పాకిస్థాన్ తిరిగి లేవకుండా.. చావ చితక్కొట్టాలని చాలామంది కోరుతున్నారు.
Hardeep Puri: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పాకిస్తాన్‌ని తెగ భయపెడుతోంది. ఇదే జరిగితే పాకిస్తాన్ దాదాపుగా ఎడారిగా మారుతుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్‌కి ఆకలి చావులే గతి. అయితే, సింధు జలాలపై పాక్ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పాక్ ప్రధాని సింధు నదిని ‘‘జీవనాడి’’గా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్…
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి దాడి చేస్తుందో అని పాకిస్తాన్ హడలి చేస్తోంది. బయటకు తన ప్రజల మెప్పు కోసం ఎన్నో బీరాలు పలుకుతున్నప్పటికీ, లోలోపల మాత్రం భయపడుతోంది. ఇప్పటికే, ఆర్థిక దరిద్రంలో పాకిస్తాన్ ఉంది. యుద్ధం చేస్తే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుందనేది అక్కడి ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. యుద్ధం చేయాల్సి వస్తే, మూడు రోజులకు సరిపడే చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు, ఒక వేళ యుద్ధం కోసం…
Vijay Diwas: భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణించాయి. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, అక్కడి మహ్మద్ యూనస్ పాలనలో హిందువులపై దాడులు తీవ్రమవుతున్నాయి. ఇటీవల కాలంలో హిందువులు ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లు, గుడులపై మతోన్మాద మూక దాడులు చేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గతంలో ఉన్నట్లుగా సంబంధాలు లేవు.
Lahore Declaration: భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి కోసం 1999లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు ‘‘లాహోర్ డిక్లరేషన్’’పై సంతకాలు చేశారు.