India Pak War: యుద్ధం వస్తే 4 రోజుల్లోపే పాకిస్తాన్ పని ఖతం.. ఆ దేశంపై ఉక్రెయిన్ ఎఫెక్ట్..
- పాకిస్తాన్ సైన్యాన్ని వేధిస్తున్నమందుగుండు కొరత..
- భారత్‌తో యుద్ధం వస్తే 4 రోజుల్లో పాక్ పని ఖతం..
- ఉక్రెయిన్ యుద్ధం వల్ల తగ్గిన ఆయుధ నిల్వలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pak War: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ నేతలు భారత్ ఏ చర్య తీసుకున్నా, తమ ఆర్మీ ధీటైన జవాబు ఇస్తుందని బీరాలు పలుకుతున్నారు. తమ వద్ద అణ్వాస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బలహీనతల్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము లేదని విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి.
పాకిస్తాన్ ఆర్మీ వద్ద ఆయుధాలైతే ఉన్నాయి, కానీ వీటిలో ఉపయోగించే ‘‘మందుగుండు’’ సామాగ్రి కొరత తీవ్రంగా ఉంది. ఒక వేళ యుద్ధమే వస్తే కేవలం 4 రోజుల్లోపే పాకిస్తాన్ మందుగుండు ఖతమవుతుంది. అయితే, దీనికి కారణం ఉక్రెయిన్ యుద్ధమే అని తెలుస్తోంది. ఉక్రెయిన్ తో పాకిస్తాన్ చేసుకున్న ఆయుధ ఒప్పందాలు, దాని యుద్ధ నిల్వల్ని ఖాళీ చేశాయి. ఇదే కొరతకు కారణమని చెబుతున్నారు. సైన్యానికి మందుగుండును సరఫరా చేసే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF), పెరుగుతున్న ప్రపంచ డిమాండ్, కాలం చెల్లిన సౌకర్యాల కారణంగా ఇబ్బందులు పడుతోంది. పాకిస్తాన్‌కి అవసరమయ్యేంత ఉత్పత్తి జరగడం లేదు. కేవలం 96 గంటలకు యుద్ధానికి సరిపోయే నిల్వలు మాత్రమే ప్రస్తుతం పాక్ వద్ద ఉన్నాయి.
Also Read
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
Read Also: Pahalgam terror attack: ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ..
పాకిస్తాన్ సైన్యం ఎక్కువగా ఆర్టిలరీ, సాయుధ యూనిట్లపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాక్ వద్ద M109 హోవిట్జర్లకు తగినంత 155mm షెల్స్ లేవు. BM-21 సిస్టమ్స్‌కి అవసరమయ్యే 122mm రాకెట్లు లేవు. ఇవి లేకుండా భారత్ ముందు నిలవడం అసాధ్యం. ఏప్రిల్ 2025లోని ఒక ఎక్స్ పోస్టులో పాకిస్తాన్ వద్ద ఉన్న కీలకమైన 155mm ఫిరంగి షెల్‌లను ఉక్రెయిన్‌కు మళ్లించారని, నిల్వలు ప్రమాదకరంగా తక్కువగా ఉన్నాయని పేర్కొంది.
కీలకమైన మందుగుండు సామాగ్రి లేకపోవడం వల్ల పాకిస్తాన్ సైనిక అధికారుల్లో భయం నెలకొంది. 2025 మే 02న జరిగిన స్పెషల్ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో మాజీ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా కూడా దీనిని అంగీకరించాడు. పాక్ సైన్యం, భారత్‌తో దీర్ఘకాలిక యుద్ధంలో పాల్గొనలేదని, పాక్ వద్ద మందుగుండు సామాగ్రి, ఆర్థిక బలం లేదని చెప్పారు. మరోవైపు, పాక్ ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న అప్పులు, ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు కూడా సైన్యాన్ని ప్రభావితం చేశాయి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
-
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!