Hardeep Puri: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పాకిస్తాన్‌ని తెగ భయపెడుతోంది. ఇదే జరిగితే పాకిస్తాన్ దాదాపుగా ఎడారిగా మారుతుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్‌కి ఆకలి చావులే గతి. అయితే, సింధు జలాలపై పాక్ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పాక్ ప్రధాని సింధు నదిని ‘‘జీవనాడి’’గా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ‘‘ సింధు నది మాది, మా నీరుని ఆపితే, భారతీయుల రక్తం ప్రవహిస్తుంది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ‘‘ నేను అతడి(భుట్టో) ప్రకటన విన్నాను. నీటిలో ఎక్కడైనా దూకమనండి. అయితే, నీరు లేనప్పుడు అతను ఎలా చేస్తాడు..? అలాంటి ప్రకటనల్ని పట్టించుకోవద్దు. వారికే తర్వాత అర్థం అవుతుంది’’ అని అన్నారు.
Read Also: Rahul Gandhi: ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే.. ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలు జరుగుతున్నాయి..
“పహల్గామ్ సంఘటన నిస్సందేహంగా పొరుగు రాష్ట్రం చేసిన సరిహద్దు ఉగ్రవాద దాడి, వారు బాధ్యత వహించాల్సిందే. మునుపటిలా కాకుండా, ఏ వ్యాపారం ఇప్పుడు కొనసాగదు. ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లుగా, పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది , ఇది ప్రారంభం మాత్రమే. ఉగ్రవాదులు జీవించే అత్యంత ప్రాథమిక హక్కును లాక్కుంటారు. దీనిని ప్రపంచం మొత్తం ఖండిస్తోంది. పాకిస్తాన్ కేవలం మోసపూరిత దేశం కాదు, ఇది అంతిమ క్షీణతలో ఉన్న దేశం’’ అని ఆయన అన్నారు.
లండన్‌లో పాకిస్తాన్ హైకమిషన్‌లో పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక సలహాదారు కల్నల్ తైమూర్ భారతీయుల గొంతు కోస్తాననే అర్థం వచ్చేలా ప్రవర్తించడంపై పూరి మాట్లాడుతూ.. పాకిస్తాన్ టెర్రర్ స్పాన్సర్డ్ దేశం, వారు మూల్యం చెల్లించుకోవాల్సిన స్థితిలో ఉన్నారు, ఇప్పుడు సింధు జల ఒప్పందం నుంచి వారు(పాకిస్తాన్) బయటపడగలమని భావిస్తే, వారికి శుభాకాంక్షలు అని చెప్పారు.
#WATCH | Mohali | On #Pahalgamterrorattack, Union Minister Hardeep Singh Puri says, "The Pahalgam incident is unequivocally a cross-border terrorist attack unleashed by a neighbouring state and they are taking its responsibility… Unlike before, no business will continue. Like… pic.twitter.com/IP6eGPIGIW
— ANI (@ANI) April 26, 2025