India Pakistan War: మధ్య ఆసియా దేశం నుంచి భారత్ దాడి చేసే ఛాన్సుందా..? పాకిస్తాన్‌లో కొత్త భయం..
- తజకిస్తాన్ నుంచి భారత్ దాడి చేస్తుందా..?
- పాకిస్తాన్‌లో కొత్త భయం..
- దక్షిణ తజకిస్తాన్‌లో భారత్‌కి ఎయిర్ బేస్..
- కీలకంగా మారిన ఫార్ఖోర్ వైమానిక స్థావరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి దాయాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు మాత్రం మేము భారత్‌ని ధీటుగా ఎదుర్కొంటామని బీరాలు పలుకున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, ఎంత గంభీరంగా బయటకి కనిపిస్తున్నా, పాక్ నాయకత్వంలో భారత్ అంటే భయం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా వంటి సంక్షోభ ప్రాంతాల నుంచి పాక్ తన ఆర్మీని భారత సరిహద్దుల వైపు పంపించింది. ఏ క్షణాన భారత్ దాడి చేస్తుందో అని పాక్ ఎదురుచూస్తోంది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్‌ని మరో అనుమానం వేధిస్తోంది. మధ్య ఆసియా దేశమైన తజకిస్తాన్‌లో భారత్‌కి మిలిటరీ బేస్ ఉంది. అక్కడి వైమానిక స్థావరం నుంచి దాడులు జరుగుతాయేమో అని పాక్ ప్రభుత్వం తెగ భయపడి పోతోంది. భారత్ వైపు తూర్పు సరిహద్దుల్లో పాకిస్తాన్ బలంగా ఉన్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్‌ని అనుకుని ఉన్న పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ అంత స్ట్రాంగ్‌గా లేదు. 2011లో అమెరికా, పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో దాగి ఉన్న ఒసామా బిన్ లాడెన్‌ని హతమార్చిన సమయంలో పశ్చిమ సరిహద్దు గుండానే యూఎస్ ఆర్మీ పాక్‌కి తెలియకుండా ప్రవేశించింది. ఇదే స్ట్రాటజీ భారత్ అవలంభిస్తే ఎలా అని పాక్ భయపడుతోంది.
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
Read Also: Rajnath Singh: ‘‘ప్రధాని గురించి మీరందరికి తెలుసు’’ యుద్ధంపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
పాకిస్తాన్ పక్కనే ఉన్న తజకిస్తాన్‌లో భారత్‌కి వైమానిక స్థావరం ఉందని చాలా మందికి తెలియదు. ఇది పీఓకే నుంచి 600 కి.మీ దూరంలోనే ఉంది. భారత్ గత 30 ఏళ్లుగా తజకిస్తాన్‌లో తన సైనిక ఉనికిని కొనసాగిస్తోంది. 1990లలో ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో దక్షిణ తజకిస్తాన్ లోని ఫార్ఖోర్ ప్రాంతంలో భారత సైన్యం ఒక మిలిటరీ ఆస్పత్రిని స్థాపించింది. ఆ సమయంలో తాలిబాన్ దళాలతో పోరాడుతున్న నార్తర్న్ అలయన్స్ యోధులకు వైద్య సహాయం అందించింది.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి సోవియట్ యూనియన్ వైదొలిగిన తర్వాత ఆ దేశంలో తీవ్ర అంతర్యుద్ధం జరిగింది. ఒక వైపు పాక్ మద్దతుతో దక్షిణ, తూర్పు ఆప్ఘనిస్తాన్‌పై తాలిబన్లు ఆధిపత్యం చెలాయించారు. అదే సమయంలో నార్తర్న్ అలియన్స్ ఎదురుదాడి చేసింది. ఈ సమయంలో ఫార్ఖోర్ లో భారత్ కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధ సమయంలోనే ఆఫ్ఘన్-తజక్ గెరిల్లా కమాండర్ అహ్మద్ షా మసౌద్ 2001లో ఆత్మాహుతి దాడిలో తీవ్రంగా గాయపడిన సందర్భంలో ఫార్ఖోన్‌లో భారత్ మిలిటరీ ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు. కానీ అతడు మరణించాడు. ఇప్పుడు, పహల్గాం ఉద్రిక్తతల మధ్య ఈ మిలిటరీ బేస్ కీలకంగా మారుతుందా..? అనే భయం పాక్‌లో నెలకొంది.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!