Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’కి చెందిన ఉగ్రవాదులు చంపారు. ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రమేయానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలను భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేతికి అందాయి. అయితే, భారత్‌తో ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ తన నైజాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాల ముందు చేయని ప్రయత్నం లేదు. పాకిస్తాన్‌కి ప్రస్తుతం సాయం చేసే మిత్రులు ఎవరూ కనిపించడం లేదు. దీంతో మిత్రుల…
MP Imran Masood: 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్, పాకిస్తా్న్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడుతుందా?? గతంలో మాదిరిగానే సర్జికల్ స్ట్రైక్స్ లేదా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహిస్తుందా.? అని యావత్ దేశం చూస్తోంది. రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి సంఘర్షణ వచ్చే అవకాశం ఉందా అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్‌పై దౌత్యపరంగా, ఆర్థిక పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్‌కి కీలకమైన ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’…
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్రమోడీకి ముందే సమాచారం ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి మూడు రోజుల ముందే ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఆ తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి తన పర్యటనను రద్దు చేసుకున్నారని మంగళవారం ఆరోపించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరగడానికి మూడు రోజులు ముందే ప్రధానికి ఇంటెల్ నివేదిక పంపినట్లు ఖర్గే తెలిపారు.
Terrorist: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడి విచారణలో కుల్గాంకు చెందిన ఇంతియాజ్ మహ్మద్ లష్కరే తోయిబా స్లీపర్ సెల్ సభ్యుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఉగ్ర దాడికి సంబంధించి జరిపిన దర్యాప్తులో ఇంతియాజ్ పాత్ర బయటపడిందని అన్నారు.
Islam- Terrorism: ప్రపంచ దేశాల్లో ఇస్లాం ఉన్నంత వరకూ ఉగ్రవాదం బ్రతికే ఉంటుందని బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత తస్లీమా నస్రీన్ తెలిపారు. పహల్గాం దాడిని, 2016లో ఢాకాలో జరిగిన ఉగ్రదాడితో పోల్చారు.
Terror threat: జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయా జైళ్ల దగ్గర భద్రతాను భారీగా పెంచేశారు. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు వంటి వాటికి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు సూచించాయి.
Pakistan: జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతుంది.
భారత్- పాక్ దేశాల మధ్య సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు కీలక సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఈ మీటింగ్ లో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన తమ వాదనలు తెలియజేయనున్నారు.
Blackout Drill: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో, ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ఆర్మీ కంటోన్మెంట్‌లో ఆదివారం రాత్రి ‘‘బ్లాక్అవుట్ డ్రిల్’’ నిర్వహించారు. పూర్తిగా లైట్లు ఆర్పేసి, ఎలాంటి వెలుతురు లేకుండా సైన్యం ఈ వ్యాయామంలో పాల్గొంది. తన యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకుంది. బ్లాక్అవుట్ డ్రిల్ సక్సెస్ కావడానికి ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషన్ మద్దతు, సహకారాన్ని కోరారు. డ్రిల్…
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి దాయాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు మాత్రం మేము భారత్‌ని ధీటుగా ఎదుర్కొంటామని బీరాలు పలుకున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, ఎంత గంభీరంగా బయటకి కనిపిస్తున్నా, పాక్ నాయకత్వంలో భారత్ అంటే భయం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా వంటి సంక్షోభ ప్రాంతాల నుంచి…