Blackout Drill: పాక్‌తో ఉద్రిక్తతల మధ్య, పంజాబ్ కంటోన్మెంట్‌లో సైన్యం ‘‘బ్లాక్అవుట్ డ్రిల్’’..
- పాకిస్తాన్‌తో ఉద్రిక్తల నడుమ సైన్యం కీలక డ్రిల్..
- పంజాబ్ ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్‌లో ‘‘బ్లాక్అవుట్ డ్రిల్’’..
- అరగంట పాటు వెలుతురు లేకుండా ఆర్మీ ఎక్సర్‌సైజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blackout Drill: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో, ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ఆర్మీ కంటోన్మెంట్‌లో ఆదివారం రాత్రి ‘‘బ్లాక్అవుట్ డ్రిల్’’ నిర్వహించారు. పూర్తిగా లైట్లు ఆర్పేసి, ఎలాంటి వెలుతురు లేకుండా సైన్యం ఈ వ్యాయామంలో పాల్గొంది. తన యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకుంది. బ్లాక్అవుట్ డ్రిల్ సక్సెస్ కావడానికి ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషన్ మద్దతు, సహకారాన్ని కోరారు. డ్రిల్ నిర్వహించిన సమయంలో, రాత్రి 9 గంటల నుంచి 9.30 వరకు అరగంట పాటు విద్యుత్ నిలిపేయాలని పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL)ని సైనిక అధికారులు కోరారు.
Read Also: CM Chandrababu: రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే అన్నదాత పథకాన్ని ప్రారంభిస్తామ్న సీఎం
Also Read
పాకిస్తాన్ నుంచి వస్తున్న యుద్ధ బెదిరింపుల దృష్ట్యా భారత సైన్యం కంటోన్మెంట్ లో ఆదివారం అరగంట పాటు పూర్తి బ్లాక్అవుట్ రిహార్సల్ జరిగిందని అధికారులు తెలిపారు. ఈ డ్రిల్‌కి సైనికాధికారులు స్థానికుల మద్దతు కోరారు. ఎలాంటి వెలుతురు లేకుండా ఉండేందుకు ఇన్వర్టర్లు, జనరేటర్ లైట్లు లేకుండా చూసుకోవాలని స్థానికుల్ని కోరారు. పాకిస్తాన్‌కి సరిహద్దు ప్రాంతంలోనే ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ఉంటుంది. పాకిస్తాన్‌పై సైనిక దాడికి అవకాశం ఉందనే ఊహాగానాల మధ్య ఈ బ్లాక్అవుట్ రిహార్సల్స్ జరిగాయి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!