Pakistan: పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పంజాబ్‌లోని మురిడ్కే లోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్‌ని ధ్వంసం చేసింది. మే 7న భారత్ జరిపిన దాడిలో లష్కర్ ప్రధాన కార్యాయలం దెబ్బతిన్నది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ దెబ్బతిన్న భవనం శిథిలాలను తొలగిస్తోంది. కొత్తగా భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.
Read Also: Virat Kohli: తాలిబాన్ లీడర్ నుంచి విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన..
ఆపరేషన్ సిందూర్ సమయంలో రాత్రి సమయంలో 12.35 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిరాజ్ విమానాలు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోకి దూసుకెళ్లి మురిడ్కే లోని లష్కరే తోయిబాలోని మూడు ప్రధాన నిర్మాణాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు చనిపోయారు. లష్కర్ ఉగ్రవాదుల వసతి, ఆయుధాలను నిల్వ చేసే భవనాలు, శిక్షణా సౌకర్యాలు, సీనియర్ కమాండర్ నివాసాలుగా పనిచేసే ఉమ్ అల్ ఖురా అని పిలుబడే భవనాలు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 18 నాటికి , భారీ యంత్రాలతో శిథిలానున తొలగిస్తున్నారు. పునర్నిర్మాణ పనులను మర్కజ్ తోయిబా డైరెక్టర్ మౌలానా అబూ జార్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో దెబ్బతిన్న లష్కర్, జైషే మహ్మద్ స్థావరాలను నిర్మించేందుకు పాకిస్తాన్ బహిరంగంగా ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం సుమారుగా రూ. 1.25కోట్లను అందించింది. బహిరంగంగానే పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులను అందిస్తుందని, దీని ద్వారా తేలింది.