ఇటీవలి కాలంలో టీమిండియా పేసర్ ‘అర్ష్‌దీప్ సింగ్’ పేరు బాగా వినిపిస్తోంది. టీ20, వన్డేలలో నిలకడగా రాణించడమే అందుకు కారణం. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అంతేకాదు ఐసీసీ టోర్నీలలో కూడా రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో అర్ష్‌దీప్ అద్భుత స్పెల్ వేశాడు. తన 4 ఓవర్ల కోటాలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్స్ పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్…
ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు వన్డేలు ముగియగా. సిరీస్ 1-1తో సమంగా ఉంది. రాంచిలో జరిగిన తొలి వన్డేలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. రాయ్‌పుర్‌లో జరిగిన రెండో వన్డేలో అద్భుత విజయం సాధించింది. బుధవారం సఫారీలు 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి.. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం (డిసెంబర్ 6) వైజాగ్‌లో జరుగుతుంది. వన్డే మ్యాచ్ నేపథ్యంలో విశాఖ నగరంలో ఇప్పటికే…
South Africa vs India: భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరిగింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఇక, లక్ష్య ఛేదనకు దిగి సఫారీ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Virat Kohli ODI Hundreds: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ శతకాలతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో కింగ్ అద్భుత ఫామ్ పరంపర కొనసాగుతుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 41 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డుల్లో ఎక్కుతాడు. ఈ క్లబ్లో దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఉన్నారు. రాయ్‌పుర్‌లో దక్షిణాఫ్రికాతో నేడు జరిగే రెండో వన్డేలో హిట్‌మ్యాన్ ఈ రికార్డును చేరుకునే అవకాశాలు…
టీమిండియా సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్నప్పుడు తాను స్కూల్లో ఉన్నానని దక్షిణాఫ్రికా సారథి తెంబా బావుమా గుర్తుచేసుకున్నాడు. ఇప్పటికీ హిట్‌మ్యాన్ రోహిత్ భారత జట్టులో ఉన్నాడని, అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్ ప్రశంసించాడు. రోహిత్, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు బలంగా మారిందని బావుమా చెప్పాడు. తొలి వన్డేకు దూరంగా ఉన్న బావుమా.. రెండో వన్డేలో ఆడనున్నాడు. రెండో వన్డే నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో…
India Playing XI vs మూడు South Africa For 2nd ODI: వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలో కూడా గెలిచి.. టెస్ట్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు మొదటి వన్డేలో ఓడిన సఫారీలు రాయ్‌పుర్‌లో…
భారత జట్టు ఎంపికలో ఏదో తప్పు జరుగుతోందని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేడని, అతని స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని సిరీస్‌కు ఎంపిక చేసినా ప్లేయింగ్ 11లోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. నితీశ్‌కు చోటు లభించకపోతే జట్టు ఎంపికపై సమీక్షించాల్సి ఉంటుందని యాష్ అభిప్రాయపడ్డాడు. రాంచిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్…
దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్.. భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నిషేధం తర్వాత దక్షిణాఫ్రికా జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రావడానికి బీసీసీఐ చేసిన సాయం కాన్రాడ్ అమర్చిపోయాడా? అంటూ ఫైర్ అయ్యారు. రెండు దేశాల మధ్య మంచి క్రికెట్ సంబంధాలు ఉన్నాయని, కాన్రాడ్ అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాన్రాడ్ క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేయడం…
ప్రస్తుతం తన వయసు 37 ఏళ్లు అని, ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు రోజు ఆటకు సంబంధించి మదిలోనే విజువలైజ్ చేసుకుంటా అని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తాను ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉంటా అని, మానసికంగానూ సిద్ధమై మ్యాచ్‌లు ఆడుతా అని చెప్పాడు. కఠిన సాధన చేస్తేనే మంచి ఫలితం వస్తుందనే దానిని తాను నమ్మనని, మానసికంగా ముందే సిద్ధమవుతా అని పేర్కొన్నాడు. ఫిట్నెస్ విషయంలో ఎలాంటి సమస్య లేదని, మానసికంగా…