దక్షిణాఫ్రికాతో స్వదేశంలో భారత జట్టు మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడుతోంది. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్‌లు పూర్తయ్యాయి. 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన భారత్.. 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. వైట్ బాల్ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా టీ20 ఫార్మాట్లో తన మార్క్ చూపెట్టేందుకు సిద్దమైంది. టీ20 సిరీస్‌లో కూడా సఫారీలను చిత్తు చేయాలని భారత్ చూస్తోంది. టీ20 సిరీస్…
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను విమర్శిస్తాడనే ఆరోపణలు ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కోల అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో ఇద్దరూ ఇలాగే స్థిరంగా రాణించాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు. రోహిత్-కోహ్లీలు ప్రపంచ స్థాయి బ్యాటర్లు అని, ఈ విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానన్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకే రకమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలనే అభిప్రాయంను తాను ఏకీభవించను…
Team India Playing XI: టెస్ట్ సిరీస్‌లో ఎదురైన పరాభవం తర్వాత సౌతాఫ్రికాపై ODI సిరీస్ ను 2-1 తేడాతో గెలిచి.. ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా T20 ఫార్మాట్‌పైనే భారత జట్టు కేంద్రీకరిస్తోంది.
భారత జట్టులో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాన్ని ఎన్నడూ ప్రశ్నించకూడదని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నారు. రో-కోలకు ఆట కొత్త కాదని, కొన్ని ఓవర్లు ఆడితే లయ అందుకుంటారన్నారు. ఇద్దరిని ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రోహిత్-కోహ్లీలు ఒకే ఫార్మాట్ ఆడుతున్నా.. ఫామ్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదని బంగర్ చెప్పుకొచ్చారు. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రో-కోలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే…
విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం చాలా మంది టీమిండియా క్రికెటర్లకు కలిసొచ్చింది. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 148 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది ఇక్కడే. ఈ ఇన్నింగ్స్‌తోనే జులపాల ధోనీని క్రికెట్ ప్రపంచం గుర్తించింది. సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా వైజాగ్ మైదానం బాగా కలిసొచ్చింది. విశాఖ మైదానంలో జరిగిన వన్డేల్లో కింగ్ భారీగా పరుగులు చేశారు. అంతలా అంటే.. విశాఖ అంటేనే కోహ్లీకి ఊపోస్తుందా? అని…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అవార్డు గెలుచుకోవడం ద్వారా కోహ్లీ ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. కింగ్ తన అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ ఇప్పటివరకు 20 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు…
క్రికెట్లో తన మునుపటి స్థాయికి మరలా చేరుకున్నానని భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో తాను ఆడిన విధానం చాలా సంతృప్తిని ఇచ్చిందని చెప్పాడు. గత 2–3 ఏళ్లలో తాను ఇలా ఆడలేదని, ఈ సిరీస్‌లోని ఆటతీరు తనకు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పాడు. చాలా కాలం తర్వాత తన ఆట ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించాడు. సిరీస్ 1-1తో సమం అయినప్పుడు జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని…
యశస్వి జైస్వాల్ సెంచరీ (116*), రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65) ల అర్ధ సెంచరీల కారణంగా, వైజాగ్‌లో జరిగిన మూడవ వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. దీనితో, టెస్ట్ సిరీస్‌లో తన ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ డిసెంబర్ 9న జరుగనుంది. Also Read:Harley Davidson X440T:…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విరాట్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. రాంచీ వన్డేలో కోహ్లీ 135 పరుగులు చేసిన కింగ్.. రాయ్‌పూర్ వన్డేలో 102 పరుగులు చేశాడు. కోహ్లీ తన వన్డే కెరీర్లో మొత్తం సెంచరీల సంఖ్య 53కి చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ మొత్తం 84 సెంచరీలు చేశాడు. వన్డేలతో పాటు టెస్టులు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా…
ఇటీవలి కాలంలో టీమిండియా పేసర్ ‘అర్ష్‌దీప్ సింగ్’ పేరు బాగా వినిపిస్తోంది. టీ20, వన్డేలలో నిలకడగా రాణించడమే అందుకు కారణం. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అంతేకాదు ఐసీసీ టోర్నీలలో కూడా రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో అర్ష్‌దీప్ అద్భుత స్పెల్ వేశాడు. తన 4 ఓవర్ల కోటాలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్స్ పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్…