టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకున్నాడు. ఇటీవల అతడికి చేసిన కరోనా నిర్ధారణ పరీక్షణ నెగిటివ్ రావడంతో రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు అతడు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ కఠోర సాధన చేస్తున్నాడు. భారీ షాట్లతో పాటు డిఫెన్సివ్ షాట్లు ఆడుతూ రోహిత్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దీంతో అతడు త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డేలు, టీ20లకు అందుబాటులో ఉండటం…
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రెండు రోజులు టీమిండియానే హవా చూపించింది. దీనికి కారణం ముగ్గురు మోనగాళ్లు. వాళ్లే రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా. పంత్, జడేజా సెంచరీలతో చెలరేగితే.. వరుణుడు అంతరాయం కలిగించినా బుమ్రా పట్టుదలతో బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కష్టాల్లో పడేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో జస్‌ప్రీత్ బుమ్రా మరో ఘనతను సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021-23లో ఇప్పటివరకు అత్యధిక…
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియాకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నా మనోళ్లు సత్తా చాటుతున్నారు. తొలిరోజు రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగగా.. రెండో రోజు బుమ్రా ఇంగ్లండ్‌కు తన దెబ్బ రూచి చూపించాడు. బ్యాటింగ్‌లో ఒకే ఓవర్‌లో 35 పరుగులు పిండుకున్న బుమ్రా.. బౌలింగ్‌లోనూ రాణించాడు. కెప్టెన్‌గా ఎలాంటి ఒత్తిడిని అతడు ఎదుర్కొన్నట్లు కనిపించలేదు. బుమ్రా విజృంభించడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు…
ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను చూస్తే పాపం అని టీమిండియా అభిమానులు అనక మానరు. ఎందుకంటే గతంలో టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టి అతడికి యువరాజ్ సింగ్ నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఇప్పటికీ ఆ ఓవర్‌ను అటు ఇంగ్లండ్ అభిమానులు, ఇటు టీమిండియా అభిమానులు మరిచిపోలేరు. తాజాగా బర్మింగ్ హామ్ టెస్టులో బ్రాడ్ బౌలింగ్‌లోనే ఒకే ఓవర్‌లో బుమ్రా 35 పరుగులు పిండుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక…
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి రోజు పంత్ మెరుపు సెంచరీ చేయగా.. రెండో రోజు తొలి సెషన్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జడేజాకు ఇది మూడో సెంచరీ కాగా ఈ ఏడాది రెండో సెంచరీ. అటు ఓవర్సీస్‌లో మాత్రం జడేజాకు ఇదే తొలి సెంచరీ. అతడు 183 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో సెంచరీ పూర్తి…
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా తొలుత తడబడినా తరువాత కుదురుకుంది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసి భారత్‌కు మంచి స్కోరును అందించాడు. ఈ మ్యచ్‌లో రిషబ్ పంత్ 111 బంతుల్లోనే 146 పరుగులు చేశాడు. అయితే 89 బంతుల్లోనే సెంచరీ చేసి భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. దీంతో 17 ఏళ్ల క్రితం నాటి ధోనీ రికార్డును…
ఇంగ్లండ్‌తో జరగనున్న కీలక టెస్టు మ్యాచ్‌లో శుక్రవారం నుంచి టీమిండియా తలపడనుంది. గత ఏడాది జరగాల్సిన ఈ టెస్టును ఐసీసీ రీ షెడ్యూల్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో అభిమానులు ఆసక్తికర పోరును వీక్షించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ వర్సెస్ జేమ్స్ అండర్సన్ మధ్య జరిగే పోరు అందరిలోనూ ఉత్కంఠకు గురిచేస్తోంది. దశాబ్ద కాలంగా ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు. అండర్సన్ కెరీర్‌లో చివరి దశకు చేరుకోవడంతో టీమిండియాతో అతడికి ఇదే చివరి టెస్టు…
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. తొలుత ఓ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ అనంతరం వన్డేలు, టీ20లలో కూడా ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మేరకు వన్డేలు, టీ20లకు భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి హార్డిక్ పాండ్యా పునరాగమనం చేశాడు. అటు గాయం నుంచి కోలుకున్న జడేజా కూడా వన్డేలకు అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల పొట్టి క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా సెలక్టర్లు…
బర్మింగ్ హామ్ వేదికగా నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ జరగనుంది. గత ఏడాది కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్‌ను ఐసీసీ తాజాగా నిర్వహిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, డ్రా అయినా సిరీస్ మన సొంతం అవుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. రోహిత్ శర్మకు కరోనా నిర్ధారణ కావడంతో ఈ మ్యాచ్‌కు సారథిగా బుమ్రా వ్యవహరించనున్నాడు. వైస్…