Mohammad Shami: చరిత్ర సృష్టించిన షమీ.. భారత్ తరఫున తొలి బౌలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన షమీ.. ఈ సందర్భంగానే 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల మార్క్‌ని అందుకున్న మూడో బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు. మొత్తం 80 మ్యాచ్‌ల్లో షమీ ఆ ఫీట్‌ని అందుకున్నాడు. అటు ఆఫ్గన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా అవే గణాంకాల్ని నమోదు చేయడంతో.. ఇద్దరూ సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు.
తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్(77 మ్యాచ్‌లు), పాకిస్తాన్ మాజీ స్టార్ సక్లెయిన్ ముస్తాక్ (78 మ్యాచ్‌లు) ఉన్నారు. రషీద్, షమీల తర్వాత ట్రెంట్ బౌల్ట్(81 మ్యాచ్‌లు), బ్రెట్ లీ(82 మ్యాచ్‌లు) నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. కేవలం టీమిండియా తరఫు మాత్రం 150 వికెట్ల మార్క్‌ని అత్యంత వేగంగా అందుకున్న తొలి బౌలర్‌గా షమీ నిలిచాడు. ఇంతకముందు అజిత్ అగార్కర్ 97 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మార్క్‌ని అందుకొని, ఇన్నాళ్లూ అగ్రస్థానంలో కొనసాగాడు. ఇప్పుడు షమీ 80 మ్యాచ్‌ల్లోనే ఆ మార్క్ అందుకొని, అగార్కర్ రికార్డ్‌ని బద్దలుకొట్టాడు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
ఇక బంతుల పరంగా చూసుకుంటే.. 150 వికెట్ల మైలురాయిని 4071 బంతుల్లో అందుకున్నాడు. దీంతో, అత్యంత తక్కువ బంతుల్లో ఈ ఫీట్ అందుకున్న ఐదో బౌలర్‌గా షమీ అవతరించాడు. మిచెల్ స్టార్క్ మాత్రం 3857 బంతుల్లోనే ఆ మైలురాయిని అందుకోగలిగాడు. అతని తర్వాత అజంతా మెండిస్(4029 బంతులు), సక్లెయిన్ ముస్తాక్ (4035 బంతులు), రషీద్ ఖాన్ (4040 బంతులు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!