నాటింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 216 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో ఓడిపోతుందని అభిమానులు భావించారు. అయితే భారత శిబిరంలో సూర్యకుమార్ ఆశలు రేకెత్తించాడు. అతడు ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడి మెరుపు సెంచరీ చేశాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 117 పరుగులు చేసి 19వ ఓవర్‌లో అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 17 పరుగుల తేడాతో గెలిచి పరువు నిలబెట్టుకుంది. రోహిత్ (11), పంత్ (1), కోహ్లీ (11), దినేష్ కార్తీక్ (6), రవీంద్ర జడేజా (7) విఫలమయ్యారు.
Read Also: IND Vs ENG: మూడో టీ20లో ఇంగ్లండ్ భారీ స్కోరు.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
సూర్యకుమార్‌కు శ్రేయాస్ అయ్యర్ (28) కాస్త సహకారం అందించాడు. దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజాలలో ఒక్కరు నిలబడినా ఈ మ్యాచ్ ఇండియా గెలిచి ఉండేది. ఇంగ్లండ్ బౌలర్లలో టోప్లీ 3 వికెట్లు తీయగా విల్లీ, జోర్డాన్ తలో రెండు వికెట్లు సాధించారు. గ్లీసన్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. కాగా మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో చేజిక్కించుకుంది.