ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చివరి టీ20లో మెరుపు సెంచరీతో వీరవిహారం చేసిన సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకెళ్లాడు. 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్య తన కెరీర్‌లోనే బెస్ట్ ఐసీసీ ర్యాంకింగ్ నమోదు చేశాడు. టీ20ల ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ ఐదో స్థానంలో నిలిచాడు. విశేషం ఏంటంటే.. టాప్ టెన్‌లో ఇండియా నుంచి ఉన్న ఏకైక ఆటగాడు అతడే. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లలో ఇషాన్ కిషన్(12), రోహిత్(18), రాహుల్(19) ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ ఓపెనర్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Read Also: Viral Tiktok: వీడు మాములోడు కాదు… పోలీస్ వెహికల్ లోనే..
అటు ఐసీసీ వన్డే ర్యాంకుల్లో బౌలింగ్ విషయంలో బుమ్రా నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 7.2 ఓవర్లు బౌలింగ్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రా కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు మెయిడిన్ ఓవర్లు ఉండగా.. నలుగురు బ్యాటర్లు బౌల్డ్‌గా వెనుదిరిగారు. బుమ్రాకు వన్డే కెరీర్‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఈ ప్రదర్శనతో వన్డే ర్యాంకుల్లో 718 పాయింట్లు సంపాదించి నెం.1 స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు టాప్-1లో ఉన్న న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్ రెండో స్థానానికి పడిపోయాడు. అటు వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 892 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ (803), రోహిత్ శర్మ (802) వరుసగా మూడో స్థానంలో, నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.