Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా, యువ సంచలనం అభిషేక్ శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బౌలర్ల విభాగంలో వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. అయితే, ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా స్థానాన్ని పాకిస్తాన్ ఆటగాడు సైమ్ అయూబ్ భర్తీ చేశాడు. Pushpaka Vimana…
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సంచలనం నమోదయ్యింది. టీమిండియా యంగ్ ఆటగాడు తిలక్ వర్మ తన కెరియర్ అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆధారంగా తిలక్ వర్మ ఈ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం తిలక్ వర్మ ఏకంగా 720 స్థానలు ఎగబాకి టి20 లలో రెండో స్థానంను దక్కించుకున్నాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. ఇప్పుడు టీ20 ర్యాంకింగ్స్‌లో అతి పిన్న వయస్కుడైన టాప్…
బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు.. టీ20 ఆల్ రౌండర్‌గా ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మహ్మద్ నబీ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ అజేయంగా నిలిచింది. గ్రూప్ 'సి' పోరులో ఉగాండా, న్యూజిలాండ్‌లను ఓడించింది. నబీ బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో టీ20 ఆల్ రౌండర్‌గా నంబర్ వన్ స్థానాన్ని…
బుధవారం ఐసీసీ బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అందులో టీమిండియా స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇంతకుముందు నెంబర్ వన్ స్థానంలో ఉన్న పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టాప్-10లో టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు చోటు దక్కించుకున్నారు. మరొక బ్యాటర్ యశస్వీ జైస్వాల్.. అతను ఆరో స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి ఎగబాకాడు.
ICC T20 Rankings: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియాకు ఇంగ్లండ్ రూపంలో షాక్ తగిలింది. ఫైనల్‌కు వెళ్లి చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొని కప్‌ను ముద్దాడే అవకాశాన్ని కోల్పోయింది. అయితే సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినా ఐసీసీ టీ20 ర్యాంకుల్లో మాత్రం టీమిండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 268 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ (264), పాకిస్థాన్ (258), దక్షిణాఫ్రికా (256), న్యూజిలాండ్ (253) తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. దీంతో కప్ పోయినా.. ర్యాంకు మిగిలిందంటూ నెటిజన్‌లు సెటైర్లు…
వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20 సిరీస్‌ను టీమిండియా వైట్ వాష్ చేసింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకుల్లోనూ టీమిండియా అదరగొట్టింది. ఈ సిరీస్ విజయంతో 269 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి టీమిండియా అగ్రస్థానానికి చేరింది. దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరడం విశేషం. అంతకుముందు 2016 ఫిబ్రవరిలో చివరిసారిగా ధోనీ సారథ్యంలో భారత్ అగ్రస్థానానికి చేరింది. మరోవైపు స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం.…
టీ20 ర్యాంకింగ్స్‌ను బుధవారం నాడు ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒకే ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆ ఆటగాడే కేఎల్ రాహుల్. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. దీంతో అతడు 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 809 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 805 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ రెండో…
తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకిగ్స్ ప్రకటించింది. అయితే ఈసారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానం నుండి ఏకంగా 8వ స్థానానికి వచేసాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్ ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. అయిన ఈ టోర్నీలోని చివరి మూడు మ్యాచ్ లలో అర్ధశతకాలతో రాణించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 8వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల…