బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు.. టీ20 ఆల్ రౌండర్‌గా ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మహ్మద్ నబీ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ అజేయంగా నిలిచింది. గ్రూప్ ‘సి’ పోరులో ఉగాండా, న్యూజిలాండ్‌లను ఓడించింది. నబీ బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో టీ20 ఆల్ రౌండర్‌గా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. గయానాలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
CM Chandrababu: రేపు సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. తొలి సంతకం దేనిపై అంటే..?
అగ్రస్థానంలో జరిగిన ప్రధాన షఫుల్‌లో నబీ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. గతంలో నంబర్ 1 స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ ఐదో స్థానానికి పడిపోయాడు. టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ 12వ స్థానానికి చేరుకుని.. తన కెరీర్‌లో అత్యధిక ర్యాంక్‌ను సాధించాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఐదో ర్యాంక్ సాధించగా, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మూడో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆరు స్థానాలు ఎగబాకి టాప్ 10లో చేరి పదో స్థానానికి చేరుకున్నాడు.
Bike Safety: వర్షాకాలంలో మీ బైక్ పాడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగ రెండో స్థానంలో నిలిచాడు. అఫ్గానిస్థాన్ జోడీ రషీద్ ఖాన్, ఫజల్‌హక్ ఫరూఖీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ అన్రిచ్ నార్ట్జే, ఫరూకీతో సమానంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ రెండు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. అతని స్వదేశీయుడైన ఫరూఖీ రెండు గేమ్‌లలో తొమ్మిది వికెట్లతో టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. మరోవైపు.. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నార్ట్జే ఉన్నాడు.. అతను ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ త్రయం ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, రిషాద్ హొస్సేన్‌లు వరుసగా 13, 19, 30 స్థానాల్లో నిలిచారు.