ICC T20 Rankings: కప్పు పోయింది.. ర్యాంకు మిగిలింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 Rankings: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియాకు ఇంగ్లండ్ రూపంలో షాక్ తగిలింది. ఫైనల్‌కు వెళ్లి చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొని కప్‌ను ముద్దాడే అవకాశాన్ని కోల్పోయింది. అయితే సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినా ఐసీసీ టీ20 ర్యాంకుల్లో మాత్రం టీమిండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 268 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ (264), పాకిస్థాన్ (258), దక్షిణాఫ్రికా (256), న్యూజిలాండ్ (253) తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. దీంతో కప్ పోయినా.. ర్యాంకు మిగిలిందంటూ నెటిజన్‌లు సెటైర్లు వేస్తున్నారు. వరల్డ్ కప్ సాధించకుండా ర్యాంకులు సాధించి ఏం ఉపయోగం అంటూ ప్రశ్నిస్తున్నారు.
అటు టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), డెవాన్ కాన్వే(న్యూజిలాండ్), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), ఆడిన్ మార్‌క్రమ్ (దక్షిణాఫ్రికా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకుల్లో టాప్-10లో ఒక్క టీమిండియా బౌలర్ కూడా లేడు. హసరంగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (ఆప్ఘనిస్తాన్), హేజిల్ వుడ్ (ఆస్ట్రేలియా), షాంసీ (దక్షిణాఫ్రికా), జంపా (ఆస్ట్రేలియా) టాప్-5లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు. షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్), మహ్మద్ నబీ (ఆప్ఘనిస్తాన్) టాప్-2లో కొనసాగుతున్నారు.
Also Read
- Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
- Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
Read Also: Virat Kohli: కప్పు చల్ గయా.. రికార్డులు మాత్రం ఆగయా..!!
మరోవైపు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంటిముఖం పట్టిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో టీ20 సిరీస్‌కు హార్దిక్, వన్డే సిరీస్‌కు ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ టూర్‌కు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి భారత జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?