వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20 సిరీస్‌ను టీమిండియా వైట్ వాష్ చేసింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకుల్లోనూ టీమిండియా అదరగొట్టింది. ఈ సిరీస్ విజయంతో 269 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి టీమిండియా అగ్రస్థానానికి చేరింది. దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరడం విశేషం. అంతకుముందు 2016 ఫిబ్రవరిలో చివరిసారిగా ధోనీ సారథ్యంలో భారత్ అగ్రస్థానానికి చేరింది.
మరోవైపు స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం. బంగ్లాదేశ్‌పై 2-1, వెస్టిండీస్‌పై 2-1, శ్రీలంకపై 2-0, ఇంగ్లండ్‌పై 3-2, న్యూజిలాండ్‌పై 3-0, వెస్టిండీస్‌పై 3-0 తేడాతో వరుసగా ఆరు సిరీస్ విజయాలను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. కాగా గురువారం నుంచి స్వదేశంలోనే శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌కు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు.
