తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర ఉండే అమాయక మహిళలను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత చల్లగా ఉడాయిస్తున్నారు చీటర్లు. చిట్టిల పేరుతో కుచ్చుటోపి పెట్టిన మరో కేటుగాడి కేసు వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల మేర నట్టేట ముంచినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్ సీ టైప్ కాలనీలో నివాసం ఉంటున్న పుల్లయ్య ఈ మోసానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాకు చెందిన పుల్లయ్య, ఎస్‌ఆర్ నగర్‌లో మేస్త్రి పని చేసుకుంటూ చిట్టీల బిజినెస్ ప్రారంభించాడు. 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు చిట్టీలు ప్రారంభించాడు. సుమారు 500 మంది నుండి చిట్టీలు వసూలు చేసిన పుల్లయ్య.. చిట్టి గడువు ముగిసిన డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానంటూ నమ్మించాడు.
READ MORE: Maha Kumba Mela: ఎన్ని కోట్ల మంది స్నానాలు చేశారు.. ఎంత ఆదాయం వచ్చింది.. వివరాలు ఇవే!
ఈనెల 23 నుంచి చిట్టి డబ్బులు అందరికీ ఇస్తానంటూ చెప్పిన పుల్లయ్య.. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. సీ టైప్ కాలనీలో మోసగాడికి చెందిన జీ ప్లస్ ఫోర్ భవనం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. గతంలోనూ అనంతపురంలో ఇదేవిధంగా మోసం చేసి హైదరాబాద్‌కు వచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. ఫిర్యాదు అనంతరం ఈ అంశంపై పోలీసు చర్యలు తీసుకోనున్నారు.
READ MORE: Pavani Karanam : లేటెస్ట్ ఫొటోస్ తో రచ్చ లేపిన పుష్ప రాజ్ చెల్లెలు