హైదరాబాద్ నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట హిట్ అండ్ రన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ టూ వీలర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టూ వీలర్ పై వెళ్తున్న ఒకరు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా.. మృతి చెందిన వ్యక్తి తాపీ మేస్త్రీ గణేశ్‌గా గుర్తించారు. ఈరోజు ఉదయం 9.10 గంటలకు ఈ ప్రమాదం జరగ్గా.. చాలా సేపటి వరకు మృతదేహం రోడ్డుపైనే ఉంది.
Read Also: SLBC Tragedy: మధ్యాహ్నంలోగా మృతదేహాల వెలికితీత పూర్తి.. డీఎన్ఏ టెస్టుల తర్వాత బంధువులకు అప్పగింత
రెండు గంటలు దాటిన మృతదేహాన్ని నార్సింగి పోలీసులు మార్చురీకి తరలించారు. చనిపోయిన గణేశ్‌కి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడు స్వగ్రామం గణేశ్ ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామం దగ్గర ఉండూరు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు గణేశ్ కుటుంబంతో సహా వచ్చాడు. కాగా.. గణేశ్ టూవీలర్‌ను ఢీకొట్టిన టిప్పర్ వాహనంకు నెంబర్ ప్లేట్ లేదు.
Read Also: Heroine Rambha: వెండితెరకి గ్రాండ్ రీ-ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్