హైదరాబాద్ నగరంలో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగి పరిధిలో హిట్ అండ్ రన్ కేసు ఇది రెండోది. శనివారం ఒక ఘటన జరగగా.. మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నడుచుకుంటూ వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. స్పాట్‌లోనే యువకుడు కొవూరి శ్రీనివాస్ ప్రాణాలు విడిచాడు. ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరగింది.
Read Also: Adhik : ఒక్కొక్క హిట్ మూవీ నుండి ఒక్కో లుక్ కాపీకొట్టిన దర్శకుడు
ఈ ఘటనకు సంబంధించి ప్రమాద దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. టాటా హారీయర్ కారు ఢీ కొట్టి కారు యజమాని ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న నార్సింగి పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హిట్ అండ్ రన్ కేసులు నిత్యం వందలాది జరుగుతూనే ఉన్నాయి. అయిన్పటికీ.. ఈ ప్రమాదాలు ఆగడం లేదు.
Read Also: RACE : రేస్ 4లోకి ఎంట్రీ ఇస్తోన్న మాజీ టాలీవుడ్ బ్యూటీ.?