ఆమె అనాధ.. తల్లిదండ్రులు చనిపోయారు.. ముగ్గురు అక్క చెల్లెలు.. వీళ్లు ముగ్గురు కలిసి జీవిస్తున్నారు.. ఇందులో ఒక్కరికి వివాహమైంది. అక్క చెల్లెలు అందరు కూడా సంతోషించారు.. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు.. అక్క భర్త చేసే వేధింపులకు ఆత్మహత్య చేసుకుంది.. అక్క చెల్లెల్ని వదిలి మళ్లీ మరొకసారి అనాధల్ని చేసింది.. బావ వేధింపుల వల్లే అక్క చనిపోయిందంటూ చెల్లెలు అందరు కలిసి ఫిర్యాదు చేశారు. గుండెపోటుతో మరణించింది అని చెప్తున్నప్పటికీ ఒంటిపై గాయాలు ఉండడంతో బావ కొట్టి చంపాడని ఫిర్యాదు చేశారు.
Also Read:Hyderabad: అతడికి 22 ఆమెకు 35.. ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి..
మలక్‌పేటలో విషాధం చోటు చేసుకుంది. వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఈ సంఘటనతో మలక్‌పేట్‌లోని జమునా టవర్స్ లో జరిగింది. వివాహిత గుండెపోటుతో చనిపోయిందని ఆమె భర్త చెబుతుంటే, వివాహిత కుటుంబ సభ్యులు మాత్రం, ఆమెను భర్తే కొట్టి చంపాడని అంటున్నారు. కేసు నమోదు చేసి వివాహిత మరణానికి కారణాలు పై ఆరా తీస్తున్నారు పోలీసులు.
Also Read:Pendem Dorababu: డిప్యూటీ సీఎం పవన్‌తో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భేటీ.. జనసేనలో చేరికకు ముహూర్తం ఫిక్స్
ఫోటోలో మీరు చూస్తున్న ఈ మహిళా పేరు సింగం శిరీష.. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోగా, మరో ఇద్దరు అక్కలతో కలిసి పెరిగింది. నర్సింగ్ పూర్తి చేసిన శిరీష, జేఎన్ఎంగా పనిచేస్తోంది. కర్నూలుజిల్లాలోని ఈగలపెంటకు చెందిన వినయ్ తో సింగం శిరీషకు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆరేళ్ళ పాప ఉంది. వినయ్, శిరీషలు మలక్‌పేట జమున టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. కాగా, శిరీష సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.
Also Read:Odisha: అనారోగ్యానికి గురైన నెల రోజుల శిశువు.. నయం కావడానికి ఒంటిపై 40 వాతలు..
శిరీష చనిపోయిన విషయాన్ని చెప్పి చెప్పనట్లుగా ఆమె సోదరికి ఫోన్ చేసి చెప్పాడు వినయ్. అంతటితో ఆగకుండా శిరీష మృతదేహాన్ని తన స్వగ్రామానికి తరలిస్తుండగా ఆ సమాచారం శిరీష కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే మలక్‌పేట్ పోలీసులను ఆశ్రయించారు శిరీష కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసిన పోలీసులు, శిరీష మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తీసుకురావాలని వినయ్ కి చెప్పారు. దీంతో వినయ్, శిరీష డెడ్‌బాడీని మార్చురీకి తీసుకువచ్చాడు.
Also Read:Harassing On Horse: పెళ్లి ఊరేగింపులో గుర్రంపై దారుణం.. సిగరెట్ తాగించి ఆపై?
శిరీష మృతికి వినయ్ కారణమని ఆమె సోదరి అంటోంది. మద్యానికి బానిసగా మారిన వినయ్, నిత్యం శిరీష ను చిత్రహింసలకు గురి చేసేవాడిని చెబుతున్నారు. అతని వేధింపుల గురించి చెబుతూ ఉండేదని అంటున్నారు. తల్లిదండ్రులు లేరు కాబట్టి ఏం చేసినా ఎవరూ అడిగేవారు లేరని, అందుకే శిరీషను చంపాడని ఆరోపిస్తున్నారు. ఆమె మృతదేహం పై గాయాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
Also Read:Gopireddy Srinivasa Reddy: పోసానిపై 14 కేసులా..? మీరు 3 కేసులు పెడితే రేపు 30 పెట్టే సమయం ఉంది..!
జమునా టవర్స్ లో ఈ రోజు మాకు నల్లా వస్తుందని, అందుకోసం నా సోదరి శిరీష ను నిద్ర లేపడానికి ట్రై చేస్తే ఆమె లేనేలేదని అంటున్నాడు వినయ్. జేఎన్ఎంగా జాబ్ చేసే ప్రాంతంలో ఇబ్బందులు ఉన్నాయని టెన్షన్ పడేదని, ఎక్కువగా ఆలోచించి వద్దని చెప్పేవాడిని వినయ్ అంటున్నాడు. శిరీష హార్ట్ ఎటాక్ తో చనిపోయిందని ఆ విషయం డాక్టర్లే చెప్పారని అంటున్నాడు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని అంటున్నాడు.
Also Read:CM Revanth Reddy: కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ
శిరీష తో తనకు 14 ఏళ్ల స్నేహం ఉందని, ఇద్దరం కలిసి ఒకే ఆస్పత్రిలో పనిచేసే వాళ్ళమని శిరీష వదిన, వినయ్ సోదరి చెబుతోంది. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో నా సోదరుడిని పెళ్ళి చేసుకొమ్మని తానే చెప్పానని అంటోంది. ఉదయం ఇంట్లో నిద్ర లేపడానికి చూశానని, ఎంతకి లేకపోవడంతో సీపీఆర్ చేశానని చెబుతంది. శిరీష మృతికి కారణమైన వినయ్ ని కఠినంగా శిక్షించాలని, శిరీష కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. శిరీష అనుమానాస్పద మృతి పై పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది. కాగా, శిరీష మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తికావడంతో ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.