మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా.. మీ ఇంట్లో బారసాల జరుగుతుందా.. మీ ఇంట్లో పెళ్లి అవుతుందా.. లేదంటే మీ ఇంట్లో ఏదో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుందా.. అయితే మీ ఇంటి ముందు వెంటనే కొంతమంది వాలిపోతారు.. మాకు లక్షల రూపాయల డబ్బులు కావాలని అడుగుతారు.. ఇవ్వకపోతే నానా రభస చేస్తారు.. బట్టలు చింపుకుంటారు.. బట్టలు పైకి ఎత్తుతారు.. ఇంట్లోకి దూరిపోతారు.. హంగామా చేస్తారు.. హల్చల్ చేస్తారు.. నానా రచ్చ చేస్తారు.. డబ్బులు ఇవ్వకపోతే మన పని అంతే.. ఎంతో కొంత వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టవలసిందే.. లేదంటే మన జీవితం రోడ్డు పాలు అవుతుంది.. లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు.. చివరికి వేలలో సమర్పించుకోవాల్సి ఉంటుంది.
Also Read:BSNL: బిఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా.. అపరిమిత కాల్స్ ఏడాది పాటు వ్యాలిడిటీ!
డబ్బులు తీసుకొని వెళుతూ వెళుతూ ఒక సింబల్ ని మన ఇంటి మీద వేసి వెళ్ళిపోతారు.. అంటే మరొకరు ఇటువైపు రారు అని దాని అర్థం.. అయితే వీళ్ళ దోపిడీకి అడ్డుకట్ట లేదా లేదు అని చెప్పవచ్చు.. పోలీసులు కావచ్చు ఇతర అధికారులకు కావచ్చు వీళ్ళని కౌన్సెలింగ్ చేసి సన్మార్గంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ వీళ్ళు మాత్రం మారడం లేదు.. పోలీసులు ఒకటే చెప్తున్నారు.. మీ ఇంటి ముందటికి ఈ ట్రాన్స్ జెండర్స్ కనుక వచ్చి హంగామా చేస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వమని అడుగుతున్నారు.. ట్రాన్స్ జెండర్స్ అరాచకాలకు చెక్ పెట్టిన సరూర్ నగర్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. ఫంక్షన్స్ రోడ్లమీద వచ్చి హంగామా చేస్తున్న ఈ ట్రాన్స్ jendrar మూకుమ్మడిగా పోలీసులు పట్టుకున్నారు. 10 మంది ట్రాన్స్ జెండర్స్ సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.
Posani Krishnamurali: పోసానికి నరసరావుపేట కోర్టు 14 రోజుల రిమాండ్
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పి&టీ కాలనీ, కట్టకింద నివాసం ఉంటూ రాత్రుళ్ళు రోడ్లపైకి వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్న ట్రాన్స్ జెండర్స్ ఇండ్లపై రైడ్స్ నిర్వహించారు. 10 మందిని అదుపులోకి తీసుకున్న సరూర్ నగర్ పోలీసులు. ట్రాన్సజెండర్స్ అరాచకాలపై పీ&టీ కాలనీ అసోసియేషన్ పిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ట్రాన్స్ జెండర్స్ వారుంటున్న ఏరియా ను రెడ్ లైట్ ఏరియాగా మార్చి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తూ, ఇష్టారీతిన దందా చేస్తున్న ట్రాన్స్ జెండర్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.
Also Read:Thummala Nageswara Rao: రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు సాగునీరు..
వీరు ఎక్కడి వారు, ఇక్కడ ఎంతకాలం నుంచి వుంటున్నారని విచారణ చేస్తున్నారు.. దీనికి తోడు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే ఫంక్షన్ వద్దకు వెళ్లి హల్చల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఆటో డ్రైవర్లతోటి కనెక్షన్ పెట్టుకొని ఫంక్షన్స్ వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. వీరిని విచారణ అనంతరం రిమాండ్ కు తరలించనున్నారు.