Kedar: 10 మంది మాజీ ఎమ్మెల్యేలకు, 4 నిర్మాతలకు బినామీగా కేదార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మాత కేదార్ మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. కేదార్ ఎలా చనిపోయాడు అనే దాని పైన పోలీసులు ఎటు తెలుంచలేకపోతున్నారు. దుబాయ్ లో తన ఫ్లాట్లో నాలుగు రోజుల క్రితం నిర్మాత కేదార్ చనిపోయాడు.. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ అందుకు సంబంధించి అధికారికంగా పోలీసులు నిర్ధారించ లేకపోతున్నారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత నివేదిక అనాలిసిస్ చేసిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కేదార్ మృతి పైన రాజకీయ ప్రకంపనులు రేకెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగుతోంది. సినీ నిర్మాతలతో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. కేదార్ను నమ్ముకొని దాదాపు 100 కోట్ల పైగా డబ్బులను ఇవ్వడం జరిగింది. నలుగురు నిర్మాతలు సినిమా కోసం డబ్బులు ఇవ్వగా రాజకీయ నాయకులు దుబాయ్ లో వ్యాపారం కోసం డబ్బులు ఇచ్చారు. అయితే ఈ డబ్బులు ఇప్పుడు ఎలా తీసుకోవాలి అనే దానిమీద సినీ నిర్మాతలు, రాజకీయ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇదిలా ఉంటే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కేదార్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారని చెబుతున్నారు. వీళ్లిద్దరి తోటి కలిసి క్రికెట్ మ్యాచ్ తో పాటు ఒక వివాహానికి దుబాయ్ లో కేదార్ అటెండ్ అయ్యాడు. తిరిగి ఒక మాజీ ఎమ్మెల్యేతో కలిసి తన ఫ్లాట్ కి రావడం జరిగింది. అదే రోజు రాత్రి కేదార్ చనిపోయాడు ఆ తర్వాత కేదార్ తో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ఆరు గంటల పాటు విచారించి తిరిగి ఇండియాకు పంపించి వేశారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు మాత్రం తాము దుబాయ్ కి వెళ్లలేదని చెప్తున్నారు. ఇకపోతే హైదరాబాదులో తన పరపతి పూర్తిగా పెరిగిపోవడం దానికి తోడు అందరి దృష్టి తన పైన ఉండడంతో కేదార్ తన మకాం దుబాయ్ కి మార్చి వేశాడు. భార్య, పిల్లల్ని ఇక్కడ పెట్టేసి వారంలో నాలుగు రోజులు దుబాయ్ లోనే ఉండిపోతున్నాడు. అక్కడే వ్యాపారాలు చేస్తున్నాడు. చాలామందికి బినామీగా వ్యవహరిస్తున్నాడు.
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
పదిమంది మాజీ ఎమ్మెల్యేలకు కేదార్ బినామీగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా నలుగురు నిర్మాతలకు కూడా కేదార్ బినామీగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. హైదరాబాదులో పబ్ బిజినెస్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున చేశాడు. ఆ సమయంలో పరిచయమైన అప్పటి ఎమ్మెల్యేలతో కలిసి దుబాయ్ తో పాటు బెంగళూరు, హైదరాబాద్ విజయవాడలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కేదార్ నిర్వహిస్తున్నాడు. కేదార్ మృతి అతి సాధారణమైనది అయితే పోలీసులు ఇప్పటికే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించి ఉండేవారు. కానీ కేదార్ మృతి అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు డీటెయిల్ గా పోస్టుమార్టం చేసి నివేదిక కోసం వెయిట్ చేస్తున్నారు. కేదార్ మృతి పైన పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే పోలీసులు కుటుంబ సభ్యులకు మృతి దేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు కూడా కేదార్ మరణం రాజకీయ – సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది.
తాజావార్తలు
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Women’s Health: మాంసం తినే మహిళలు వందేళ్లు బతుకుతారా?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!