Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
- నేడు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం..
- సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో కీలక అంశాలపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ రోజు (మార్చ్ 6) మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలోప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఆమోదించనున్నారు. బీసీ గణనకు మరోసారి ఛాన్స్ ఇచ్చిన నేపథ్యంలో నమోదు చేసుకున్న వారి వివరాలతో తుది గణననకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచే బిల్లుకు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటితో పాటుగా బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా మంత్రి మండలి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: Off The Record: పిఠాపురంలో ఒకే గూటికి బద్ద శత్రువులు..! పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయా..?
Also Read
అయితే, బడ్జెట్ సమావేశాలు ఏ రోజున ప్రారంభమయ్యేది.. బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీలతో పాటు తదితర అంశాలను తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే గవర్నర్ ప్రసంగానికి సైతం మంత్రి మండలి ఆమోద ముద్ర వేయనుంది. దీంతో పాటుగా నూతన టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వివిధ శాఖలకు సంబంధించిన కొత్త పోస్టులు సృష్టించడం.. వాటిని ఆమోదించడం చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలకు రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!