తెలుగు పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన జరిగింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అందరూ భావిస్తుండగా.. తాజాగా ఆమె కుమార్తె సంచలన వ్యాఖ్యలు దయ ప్రసాద్ చేసింది. తన తల్లి కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది.
READ MORE: YS Jagan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై జగన్ సన్సేషనల్ కామెంట్స్!
“నా తల్లి కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. తల్లి కల్పన సింగర్ గా పని చేస్తూనే పీహెచ్‌డీ, ఎల్ఎల్‌బీ చేస్తోంది. దీని కారణంగా స్ట్రెస్ కు గురవడంతో వైద్యులు ఇన్సోమ్నియా టాబ్లెట్ వాడమని చెప్పారు. టాబ్లెట్ ఓవర్ డోస్ కారణంగానే మా అమ్మ కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. మా కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు. మీడియా అవాస్తవాలు ప్రచారం చేయకండి.” అని కల్పన కుమార్తె దయ ప్రసాద్ తెలిపింది. తాను చెప్పిందే వాస్తవమేనని.. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని మీడియాను వేడుకుంది.
READ MORE: Singer Kalpana: సింగర్ కల్పన స్టేట్‌మెంట్ రికార్డు.. వెలుగులోకి సంచలన విషయాలు..
కాగా.. మరోవైపు కల్పన పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. “ఈనెల రెండో తారీఖున కొచ్చి వెళ్లి వచ్చాను. నా కూతురు కేరళలోనే ఉంటాను, హైదరాబాద్ కు రానని చెప్పింది. ఎంత అడిగినా తాను రానని చెప్పడంతో నిన్న కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చాను. రోజు తీసుకునే ట్యాబ్లెట్సే.. కాని మరో మూడు ఎక్కువ వేసుకున్నాను. మానసిక ప్రశాంతత కోసం ట్యాబ్లెట్ వేసుకునున్నాను. అదే టైంలో నా భర్త ఫోన్ చేయడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదంతా జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత 8 నిద్ర మాత్రలు వేసుకున్నాను. బాడీపెయిన్స్ రావడంతో పెయిన్ టాబ్లెట్స్ ని కూడా వేసుకున్నాను. ఆ తర్వాత నా భర్తకి ఫోన్ చేసి నేను ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నానో తెలియదని చెప్పాను. ఆందోళనతో విల్లా సెక్రటరీకి నా భర్త ప్రసాద్ ఫోన్ చేశాడు. భర్త ప్రసాద చెప్పడంతో విల్లా సెక్రటరీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.” అని కల్పన పేర్కొంది.