ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం వ్యవహారం అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఆమె నివాసంలో ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఆమె నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు వచ్చి తలుపులు బద్ధలు గొట్టి లోపలికి వెళ్లారు. బెడ్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.
మరోవైపు ఈ కేసును కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కల్పన భర్తను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. అలాగే ఆమె మొబైల్‌ను కూడా స్వాధీనం చేసుకుని.. ఏం జరిగిందో విషయాలు తెలుసుకుంటున్నారు. జోల్‌ఫ్రెష్ అనే నిద్ర టాబ్లెట్స్‌ను అధికంగా తీసుకున్నట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: AP Assembly 2025: వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ ప్రకటన!
ప్రస్తుతం కల్పన హైదరాబాద్‌లో ఉంటుంది. ఆమె పెద్ద కుమార్తె.. కేరళలో ఉంటుంది. అయితే కల్పన.. కుమార్తెకు ఫోన్ చేసి హైదరాబాద్‌కు రావాలని కోరింది. అందుకు పెద్ద కుమార్తె.. హైదరాబాద్ వచ్చేందుకు నిరాకరించింది. తాను కేరళలోనే ఉంటానని చెప్పడంతో ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్యుద్ధం నడిచినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోజు వేసుకునే టాబ్లెట్స్ కంటే.. అధికంగా వేసుకుందని పోలీసులు తెలిపారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేశారని.. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. అపార్ట్‌మెంట్ విల్లా సెక్రటరీకి ప్రసాద్ ఫోన్ చేసి సమాచారం తెలుసుకోమన్నారని వెల్లడించారు. అపార్ట్‌మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం కుదిటపడిందని.. ఈరోజు ఆమె నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని కేపీహెచ్‌బీ పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CM Yogi: కుంభమేళాలో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించింది