హైదరాబాద్ మలక్‌పేటలో వివాహిత శిరీష్ హత్య కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషాను భర్త వినయ్, ఆడపడుచు సరిత చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సరిత అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే శిరీషను చంపినట్లుగా పోలీసులు తేల్చారు.
ఇది కూడా చదవండి: YS Jagan: ప్రతి మహిళకు సీఎం రూ.36 వేల బాకీ ఉన్నారు.. చిన్నపిల్లలకు కూడా!
ఆరు నెలల క్రితమే శిరీష ఆడపడుచు సరిత అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటి నుంచి ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ కుటుంబ పరువుపోతుందని శిరీష మందలించింది. దీంతో సరిత పగతో రగిలిపోతుంది. అదునుకోసం వేచి చూస్తోంది.
ఇది కూడా చదవండి: Dil Raju : విజయ్ దేవరకొండ ‘ రౌడీ జనార్ధన్’
ఇదిలా ఉంటే శిరీష్ కొంతకాలం నుంచి మత్తు ఇంజక్షన్లు వాడుతోంది. అయితే ఈనెల 2న సరిత-శిరీష మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం శిరీషకు సారీ చెప్పి నిద్రపోయేందుకు సరిత మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. అధిక డోస్‌లో ఇవ్వడంతో శిరీష రాత్రి మత్తులోకి జారిపోయింది. ఓవర్‌డోస్ ఇచ్చి నిద్రలోనే శిరీష చనిపోయేలా సరిత చేసింది. మరుసటిరోజు శిరీషను లేపేందుకు ప్రయత్నించినట్టు సరిత డ్రామా ఆడింది. శిరీష లేవడం లేదంటూ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అంతేకాకుండా శిరీష గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లతో చెప్పించింది. అనంతరం మృతదేహాన్ని హుటాహుటినా సరిత, వినయ్ దోమలపెంటకు తరలించారు. బాధితురాలి సోదరి స్వాతికి వినయ్ ఫోన్ చేసి ఛాతీ నొప్పితో శిరీష చనిపోయినట్లు తెలిపాడు. అనుమానంతో హైదరాబాద్‌లో ఉంటున్న శిరీష మేనమామకు స్వాతి విషయాన్ని తెలియజేసింది. మేనమామ ఎంటర్‌కావడంతో హత్య బట్టబయలైంది. దోమలపెంట నుంచి మృతదేహాన్ని ఉస్మానియాకు రప్పించి పోస్టుమార్టం జరిపించాడు. శిరీషది హత్యగా పోస్టుమార్టంలో బయటపడింది. దీంతో పోలీసులు సరిత, వినయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.