బిల్డర్స్‌కు హైదరాబాద్ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నోవాటెల్‌లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు.
ఎండాకాలం సమీపించింది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంతో పోలీస్ బూత్ దిమ్మెల్ని ఢీకొట్టాడు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘బర్డ్ ఫ్లూ’ భయాందోళన కలిగిస్తోంది. కోళ్లకు వైరస్ సోకి పెద్ద ఎత్తున మృత్యువాత పడుతుండటంతో.. జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. అయినా చికెన్ అమ్మకాలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ భారీగా పడింది. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో సగానికి పైగా చికెన్ అమ్మకాలు తగ్గాయి. హైదరాబాద్‌లో నిత్యం దాదాపుగా 6 లక్షల కిలోల…
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని అన్నానగర్‌లోని పలు చికెన్ సెంటర్లపై గురువారం ఆరోగ్య, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా పట్టుబడింది. 5 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన చికెన్‌ను డెయిరీ ఫాం రోడ్డులోని ట్రెంచింగ్ మైదానం వద్ద గొయ్యి తీసి పాతిపెట్టినట్లు హెల్త్ విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు.…
తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు కులగణన అంశమే హాట్ సబ్జెక్ట్. జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించగా... వివిధ కారణాలతో కొందరు పాల్గొనలేకపోయారు. కుదరక కొందరైతే... ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసిన వాళ్ళు మరి కొందరు. అలా వివరాలు ఇవ్వని వారికోసం మరోసారి సర్వే చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఈ విషయంలో కూడా రాజకీయాలు మొదలయ్యాయి.
హైదరాబాద్ జర్నీలో ‘మైక్రోసాఫ్ట్’ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అని, మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) బోధన ప్రవేశపెడతాం అని సీఎం చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీమ్‌కు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ నూతన…
సత్యవర్ధన్ వ్యవహారంలోనే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది.. సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.. వంశీపై మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పడమట పోలీసులు.. పడమట పీఎస్‌లో 86/ 2025 వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.. బీఎంఎస్ సెక్షన్ 140, 308, 351 రెడ్ విత్ త్రి బై 5 సెక్షన్ల కింద.. ఎస్సీ, ఎస్టీ సెక్షన్ 3 సెక్షన్ 5ల కింద కేసు…
భాగ్యనగరంలో దోపిడీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దుండగులు భారీగా బంగారం, నగదును దోచుకెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవలి రోజుల్లో వరుస చోరీలతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా హిమాయత్ నగర్లో భారీ చోరీ జరిగింది. ఓ బంగారం వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు దొంగలు. వ్యాపారి లబోదిబోమంటూ హిమాయత్ నగర్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలలం రేపింది. వివరాల ప్రకారం.. హిమాయత్ నగర్లో నివాసం ఉండే బంగారం వ్యాపారి…
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఈ కేసులో తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్.. ఈ కేసులో ఇవాళ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ పోలీసులు..