టౌటే తుఫాన్ ధాటికి తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇక, దీని ప్రభావం తెలుగురాష్ట్రాలపై పడింది. హైదరాబాద్లో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లాక్డౌన్ సడలింపుల సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే భారీ వర్షం కురవడం మొదలైంది. బంజారాహిల్స్,…
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సమ్మర్లో కరోనా కేసులతో పాటుగా బంగారం ధరలు కూడా పెరగడం మొదలుపెట్టాయి. ఈరోజు కూడా బంగారం ధరలు మరింతగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరిగి రూ.45,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ.49,260కి చేరింది. దేశీయంగా అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలు జరుగుతుండటంతో చాలామంది…
గుంటూరు జిల్లా జైలు నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్కు తరలిస్తున్నారు పోలీసులు… సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రికి బయల్దేరారు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత జిల్లా జైలు వద్దకు చేరుకున్న రఘురామకృష్ణంరాజు తరపు లాయర్లు.. ఆయనను ఎప్పుడు తరలిస్తారని చాలాసేపు ఎదురుచూశారు.. ఇక, రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్ కు తరలించే విషయంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో మాట్లాడారు అడ్వకేట్ లక్ష్మీనారాయణ… కోర్టు అదేశాలను తాము పాటిస్తామని అడ్వకేట్ కు స్పష్టం…
తెలంగాణ సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి… సీఎంగా ఉండి రైతులు, ప్రజలు పట్టించుకోకుండా కాలాయాపన చేస్తున్న కేసీఆర్.. మీకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఇప్పటికైనా మేల్కొని మీ పార్టీ సమస్యలను ప్రక్కకు పెట్టి ప్రజా సమస్యలపైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కాలుతుంటే చుట్ట అంటించుకున్న చందా సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకునే పనులు మానుకోవాలని లేఖలో హితవుపలికిన కోమటిరెడ్డి.. రాష్ట్రంలో ఐకేపీ…
హైదరాబాద్లోని నారాయణగూడాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నారాయణగూడాలోని అవంతి నగర్లో ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో సడెన్ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఆగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ఇక, ఈ అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే మరేమైనా కారణాలు…
హైదరాబాద్లో ఓ బాలిక, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఆ జంట.. ఇవాళ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య నగర్ వద్ద ఉన్న క్వారీ నీటి గుంటలో శవాలుగా తేలారు.. నీటిపై తేలుతున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యవహారం వెలుగుచూసింది.. అయితే, ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (17), విషాల్ (21) అనే జంట.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని…
మామూలు రోజుల్లో ఆదివారం వస్తే ఉదయం మధ్యాహ్నం వరకు నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా రద్దీ కనిపిస్తుంది. కానీ, ఇది కరోనా కాలం. నిబంధనలు అమలౌతున్న రోజులు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఉన్నది. దీంతో ఉదయం 6 గంటల నుంచి నాన్ వెజ్ మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. భారీ సంఖ్యలో క్యూలు కట్టారు. ముషీరాబాద్ చేపల మార్కెట్ వద్ద ఇసుకేస్తే రాలనంత మంది…
హైదరాబాద్ నగరంలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు ప్రయాణమయ్యారు నగరవాసులు. దీంతో చోరీలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలోని 5 ఇళ్లలో చోరీ చేశారు. 20 లక్షల నగదు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పెళ్లి ఉండడంతో సిద్ధం చేసిన 45 తులాల బంగారం, 20 లక్షలకుపైగా నగదు…
కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీ సంఖ్యలో వెలుగుచూస్తోన్న తరుణంలో.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కొత్త టెన్షన్ పెడుతున్నాయి.. దేశ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు కాగా.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పలు కేసులు వెలుగుచూశాయి.. తాజాగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఓ కేసు బయటపడింది. అయితే, బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో కీలక సూచనలు చేశారు తెలంగాణ డీఎంఈ.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్… ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న కొన్ని కేసుల్లో బ్లాక్…